• తాజా వార్తలు

ప్రస్తుత నెగటివ్ పరిస్థితుల్లో మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మీరు టెక్ జాబు కి మోస్ట్ వాంటెడ్

ప్రపంచ వ్యాప్తంగా టెక్కీ లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తున్నది. అనేక టెక్ కంపెనీలు కొన్ని వేల సంఖ్య లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణం అని కొందరంటుంటే టెక్కీ లలో లోపించిన స్కిల్స్ అని మరి కొందరు అంటున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఆటోమేషన్ అనేది అందరూ చెబుతున్న మాట. రోజురోజుకీ మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోకపోతే ఇలాగే ఉంటుంది అని యాజమాన్యాలు అంటున్నాయి. ఏది ఏమైనప్పట్టికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి ఇంతకుముందు మాదిరిగా లేదు అనేది అందరూ ఒప్పుకోవలసిన వాస్తవం. ప్రత్యేకించి ఈ పరిస్థితులు ఇండియన్ టెక్కీ లకు మరి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచం లో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో సింహభాగం మన భారతీయులదే కదా!
అయితే మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా లేటెస్ట్ టెక్ స్కిల్స్ ను అలవరచుకుంటే మీ జాబు కి ఏ విధమైన ధోకా ఉండదు అనేది విశ్లేషకుల మాట. ఈ ఆధునిక టెక్ నైపుణ్యాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నది. వివిధ రకాల టాప్ టెక్ కంపెనీలలో ఉన్నత స్థాయి లో ఉద్యోగాలు చేస్తున్న వారి దగ్గరనుండీ మరియు ఉన్నత శ్రేణి టెక్ అనలిస్ట్ ల దగ్గరనుండి సేకరించిన సమాచారం మేరకు కొన్ని స్కిల్స్ అలవరచుకుంటే మీరు ఈ నెగటివ్ పరిస్థితుల్లో కూడా మీ ఉద్యోగంలో నిలదొక్కుకోవచ్చు అని తెలిసింది. అలాంటి ఒక 20 స్కిల్స్ ను మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం.
1. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్
2. స్విఫ్ట్
3. టాబ్లు
4. అమజాన్ మార్కెట్ ప్లేస్ వెబ్ సర్వీసెస్
5. స్త్రైప్
6. ఇన్ స్టా గ్రామ్ మార్కెటింగ్
7. MySQL ప్రోగ్రామింగ్
8. అన్ బౌన్సు
9. సోషల్ మీడియా మేనేజ్ మెంట్
10. యాంగులర్ JS
11. బిజినెస్ కన్సల్టింగ్
12. మెషిన్ లెర్నింగ్
13. బ్రాండ్ స్ట్రాటజీ
14. 3D రెండరింగ్
15. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
16. R డెవలప్ మెంట్
17. Node.js డెవలప్ మెంట్
18. యూజర్ ఎక్స్ పీరియన్సు డిజైన్
19. బ్లూ టూత్
20. జెన్ డెస్క్ కస్టమర్ సపోర్ట్

జన రంజకమైన వార్తలు