ఉద్యోగం.. అంత సులభంగా ఎవరికీ రాదు.. దీనికి ఎంతో స్కిల్ అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అకడమిక్ అర్హతలతో పాటు సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం ఉంది. అందులోనూ విపరీతమైన పోటీ ఉన్న ప్రస్తుత తరుణంలో మనం సక్సెస్ చూడాలంటే ఎలా? ..దీనికి కొన్నిస్కిల్స్ తప్పనిసరి. మరి ఆ స్కిల్స్ ఏమిటో చూద్దామా..!
పీపుల్ స్కిల్స్
ప్రస్తుతం మార్కెట్లో మనతో పని చేసేవాళ్లు ఔట్‌డేటెడ్ ఆలోచనలతో ఉంటారు. పాత తరం భావాలతో విసిగిస్తారు. అలాంటివారు ఐటీ కంపెనీల్లోనూ ఉండడం విచిత్రమే. అందుకే ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ వర్క్ చేసుకోవడం చాలా ముఖ్కం. మనం ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు మనకు తగలొచ్చు. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి ఎమోషనల్ ఇంటిలిజెన్స్ ముఖ్యం.
లీడర్‌షిప్ స్కిల్స్
ఏ రంగంలో అయినా లీడర్‌షిప్ అనేది చాలా ముఖ్యం. ఈ స్కిల్ ఉంటే ఎక్కడైనా మీరు రాణించొచ్చు. ముఖ్యంగా బృందాలుగా పని చేసే ఉద్యోగాల్లో లీడర్‌షిప్ స్కిల్ చాలా ముఖ్యం. భిన్నమైన వ్యక్తులను డీల్ చేసుకుంటూ పని జరిగించుకునేలా చేయడం నిజంగా కత్తి మీద సామే. మంచి నాయకుడు ఇలాంటి సమస్యలను సులభంగా పరిష్కరిస్తాడు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. లీడర్‌షిప్ స్కిల్స్ పెంచుకోవడం ప్రతి ఒక్కరికి అత్యావశ్యకం.
బిజినెస్ స్కిల్స్
చిన్న చిన్న స్టార్టప్‌లు వస్తున్న ఈ రోజుల్లో బిజినెస్ స్కిల్స్ చాలా ముఖ్యం. ముఖ్యంగా కొత్త కొత్త యాప్‌లు తయారు చేయాలంటే దానికి తగ్గ ఐడియాలు కూడా మన దగ్గర ఉండాలి. ఇవన్నీ బిజినెస్ స్కిల్స్‌లో భాగమే. బిజినెస్ అంటే ఏదో కోట్లాది రూపాయిలు పెట్టి చేసేది కానక్కర్లేదు. తక్కువ పెట్టుబడితో లాభదాయకండా నడిచేది అయితే చాలు.
ప్రాబ్లమ్ సాల్వింగ్
టెక్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ముఖ్యం. ముందుగా ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని దాన్ని సాల్వ్ చేయడం పెద్ద కళ. టెక్ రంగంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందుకోసం ప్లాన్ చేయాలి.. మీ సొల్యుషన్‌ని ఇంప్లిమెంట్ చేయాలి.. టెస్టు రన్ చేయాలి. మీ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత యాక్ట్ (పని) చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్‌లో భాగాలే.
డేడ్‌లైన్, క్రియేటివ్
ఏ పనిలోనైనా డెడ్‌లైన్ ఇంపార్టెంట్. అంటే ఫలానా పని ఫలానా టైమ్‌కి చేయాలనేదే ఆ డెడ్‌లైన్. అయితే ఇందుకోసం మనం ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ కోసం క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాలి. మనకు ఏం కావాలో అరేంజ్ చేసుకోవాలి. డెడ్‌లైన్‌తో పాటు క్రియేటివిటీ కూడా చాలా ముఖ్యం. ఒక పని మంచిగా అందంగా రావాలంటే కచ్చితంగా అది క్రియేటివ్‌గా ఉండాలి. అప్పుడే అందర్ని ఆకట్టుకుంటుంది.
ఈ స్కిల్స్ కూడా అవసరమే
టీమ్ వర్క్
బియింగ్ గుడ్ విత్ నంబర్స్
క్రిటికల్ థింకింగ్
ప్రెజెంటేషన్ స్కిల్స్
రైటింగ్ స్కిల్స్
ఎ వెల్ రౌండెడ్ పర్సనాలిటీ