• తాజా వార్తలు

ఈ టెక్ కంపెనీలో జాబ్ చేయాలంటే, మైక్రోచిప్ ని బాడీలో ఇంప్లాంట్ చేసుకోవాల్సిందే !

ఆఫీసుకు వెళ్లాలంటే ఏం ఉండాలి?  జ‌న‌ర‌ల్‌గా ఆఫీసుకు వెళ్తుంటే మంచి డ్రెసింగ్‌తో పాటు ఐడీ కార్డు కావాలి.. ఫోన్ ద‌గ్గ‌ర పెట్టుకోవాలి, లాంచ్ బాక్స్ ఇలా ఎన్నో అవ‌స‌రాలు ఉంటాయి. అయితే మీరు వీటిలో చాలా లేకుండానే ఆఫీసుకు నేరుగా వెళ్లిపోవ‌చ్చు? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఐడీ కార్డు లేకుండా ఆఫీసులో ఎలా అనుమ‌తిస్తారు? అస‌లు కార్డు స్పైప్ చేయ‌కుండా మ‌నం ఎలా ఆఫీసులోకి ఎంట‌ర్ అవుతాం? ఇలాంటి అనుమానాలు క‌లుగుతున్నాయి? అయితే ఇక‌పై ఒక చిప్ మీ ద‌గ్గర ఉంటే చాలు ఇవేమి అక్క‌ర్లేదు. అమెరికాలో కొత్త‌గా ఈ టెక్నాల‌జీ మొద‌లైంది. అదెలా ప‌ని చేస్తుందంటే..

చేతికి చిప్ పెట్టేస్తారు. 
అమెరికాలోని ఒక టెక్ కంపెనీలో ఉద్యోగుల‌కు మైక్రో చిప్‌ల‌ను చేతికే అమ‌రుస్తున్నారు. అంటే మీరు ఐడీ కార్డు తీసుకు రాక‌పోయినా ఫ‌ర్వాలేదు..ప‌ర్సు తీసుకు రాక‌పోయినా నో ప్రాబ్ల‌మ్‌.. అన్ని ఈ చిప్ ద్వారానే ప‌నులు జ‌రిగిపోతాయి. మీకు సంబంధించిన డేటా అంతా ఈ చిప్‌లో నిక్షిప్త‌మై ఉంటుంది. అంటే మీ చేతి భాగంలో ఈ చిప్ అమ‌రుస్తారు. అది కూడా ఎంప్లాయిస్‌కు పూర్తి ఆమోదం ఉంటేనే.  స్వీడ‌న్‌కు చెందిన బ‌యో హాకింగ్ కంపెనీ బయో హాక్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సాయంతో ఈ చిప్‌ల‌ను రూపొందించారు. ఇప్ప‌టికే ఆ కంపెనీలో 50 మందికి పైగా ఈ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నారు. ఈ చిప్స్‌లో నియ‌ల్ ఫిల్డ్ క‌మ్యునికేన్స్ టెక్నాల‌జీని ఉప‌యోగించారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష‌న్ ఆధారంగా ప‌ని చేస్తుంది. 

సెక్యూరిటీ మాటేంటి?
మన మ‌ధ్య వేలు, చూపుడు వేలు మ‌ధ్య ఉండే ప్రాంతంలో ఈ చిన్న చిప్‌ను అమ‌రుస్తారు. అయితే టెక్నాల‌జీని ఈ స్థాయిలో ఉప‌యోగించుకోవ‌డం బాగానే ఉంది కానీ మ‌రి సెక్యూరిటీ మాటేంటి? ఈ చిప్‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు సంబంధించిన వివ‌రాల‌న్ని ఎంప్లాయ‌ర్‌కు తెలిసిపోయే అవ‌కాశాలున్నాయి. మ‌న క‌ద‌లిక‌ల్ని కూడా జీపీఎస్ ఆధారంగా క‌నిపెట్టే అవ‌కాశం ఉంది.  అంతేకాదు మీ విలువైన డేటా హ్యాకింగ్‌కు గుర‌య్యే ప్ర‌మాదం కూడా ఉంది. మీ చేతికి ఉన్న చిప్ ద్వారా అప‌రిచిత వ్య‌క్తులు స‌మాచారాన్ని గ్ర‌హించే అవ‌కాశాలున్నాయి. 300 డాల‌ర్లు ధ‌ర నిర్ణ‌యించిన ఈ చిప్ ఎంత దూరం విస్త‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రం.
 

జన రంజకమైన వార్తలు