• తాజా వార్తలు

అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే గూగులే సార్‌. అందులో జాబ్ కొడితే సూపర్ ఉంటుంది అని చాలామంది చెబుతారు. ఇంత‌కీ టెకీలంతా అంత‌గా ఆరాట‌ప‌డేలా గూగుల్ కంపెనీలో ఏముంటుంది? ఉంటుంది..  ఉద్యోగుల‌ను కంటికి రెప్ప‌లా చూసుకునే గుణం ఉంటుంది.  దానికి ఉదాహ‌ర‌ణే తాజాగా గూగుల్ అనౌన్స్ చేసిన 4డేస్ వ‌ర్క్ వీక్?

ఏమిటీ 4డేస్ వ‌ర్క్ వీక్‌?
ఏమీ లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు శ‌ని, ఆదివారాలు సెల‌వు క‌దా. అంటే 5డేస్ వీక్‌. ఇప్పుడు గూగుల్ త‌న ఉద్యోగుల‌కు శుక్ర‌వారం కూడా సెల‌విచ్చి 4డేస్ వీక్ ప్ర‌క‌టించింది. ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌కే కాదు.. ఇంట‌ర్న్స్‌కి కూడా ఈ ఆఫ‌ర్ ఇచ్చింది. దీనికి జీతంలో కోతేమీ ఉండ‌దు. దీన్ని పెయిడ్ హాలీడేగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు గూగుల్ వెల్ల‌డించింద‌ని సీఎన్‌బీసీ తెలిపింది.   శుక్రవారం రోజు అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే.. వారు మరొక రోజు సెలవు తీసుకునే అవకాశం కల్పించింది.  

ఎందుకు ఈ కొత్త ప్ర‌పోజ‌ల్‌? 
కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు ఏడు నెల‌లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోం  చేస్తున్నారు.  అయితే ఈ వ‌ర్క్‌​ ఫ్రం హోంతో ప‌ని భారం పెరిగింద‌ని, ఎంప్లాయిస్ ప‌నిగంట‌లు అత‌ని ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోకి కూడా ఎంట‌ర‌యిపోతున్నాయి. దీంతో వ‌ర్క్ ఫ్రం హోం మీద కంప్ల‌యింట్స్ వ‌స్తున్నాయ‌ని గూగుల్ గ్ర‌హించింది. అందుకే మ‌రో రోజు సెల‌విచ్చి 4డే వీక్‌గా ప్ర‌క‌టించింది. అందుకే మ‌రి గూగుల్‌లో జాబ్ కావాల‌ని మ‌నోళ్లు క‌ల‌వ‌రించేది అంటున్నారు టెక్నాల‌జీ రంగ విశ్లేష‌కులు. 

జన రంజకమైన వార్తలు