ఉద్యోగ వేటలో ఉండే వాళ్లకి ఆకట్టుకునేలా రిజ్యుమ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో తెలుసు.. అంతేకాదు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఎంతటి క్లిష్టమైన ప్రక్రియో కూడా తెలుసు. మరి మీకు ఉన్న స్కిల్స్ ఏంటో వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఏ కోచింగ్ సెంటర్‌కో వెళతారు. లేదా ఏదైనా నిపుణుల సలహా తీసుకుంటారు. కానీ ఇప్పుడివేం అవసరం లేదు. లింక్డ్ ఇన్ సైట్ సాయంతో మీ నైపుణ్యాలను టెస్టు చేసుకోవచ్చు. మరి అదెలాగో చూద్దామా...
లింక్డ్ ఇన్ టెస్టు
మన నైపుణ్యాలను అసెస్ చేయడం కోసం మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌ను విజిట్ చేయాలి. ఇందులోనే మీకు ఒక పోపప్ మెసేజ్ కనిపిస్తుంది. దీనిని మీకు క్లిక్ చేయడం ద్వారా మీకో ఆన్‌లైన్ టెస్టు వస్తుంది. ఈ ఆన్‌లైన్ టెస్టును అటెంప్ట్ చేయడం ద్వారా మనం స్కిల్స్ పరీక్షించుకోవచ్చు. లింక్డ్ ఇన్ ఏడాది క్రితం బేటా వెర్షన్ ద్వారా ఈ ఫీచర్‌ను టెస్టు చేసింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ని అందరికి అందుబాటులోకి తెచ్చింది. ఈ పరీక్ష సమయంలో లింక్డ్ ఇన్ వేలాది యునిక్ టెస్టులను అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచింది.
టెస్టు చేసుకోండిలా..
లింక్డ్ ఇన్ స్కిల్ టెస్ట్ అసెస్‌మెంట్‌ను యూజ్ చేసుకోవడం చాలా సులభం. మీ లింక్డ్ ఇన్ అకౌంట్లోకి వెళ్లి ప్రొఫైల్ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తూ పోతే స్కిల్ సెక్షన్ ఉంటుంది. అందులోనే మీకు స్కిల్ క్విజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీ ప్రొఫైల్‌లో ఈ ఆప్షన్ కనిపించకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయల్సి ఉంటుంది. స్కిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఏ స్కిల్ పరీక్షించాలో అడుగుతుంది. ఆ స్కిల్‌ను ఎంటర్ చేస్తే మీకు రిజల్ట్స్ ఇస్తుంది. ఇందులో భాగంగా మీరు 15 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.