టెక్నాలజీ వచ్చి జాబ్‌లు పోగొడుతోందని చాలా మంది భయపడుతుంటారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్‌తో జాబ్స్ పోతున్నాయని యూఎస్‌లో పెద్ద ప్రచారమే జరుగుతోంది. వాస్తవంగా ప్రపంచమంతా ఇదే భయం ఉంది. కానీ అదే టెక్నాలజీతో జాబ్స్ కాపాడుకోవచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్.
జాబ్స్ పోతాయి కానీ..
ఆటోమేషన్ వస్తే ఇప్పుడున్న ఎడ్మినిస్ట్రేటివ్ జాబ్స్‌లో చాలావరకు పోతాయన్నది ప్రధానమైన ఆందోళన. ఎందుకంటే ఆఫీస్ వ్యవహారాలు చక్కబెట్టడానికి, అకౌంట్స్ చూడడానికి ఆటోమేషన్ చాలా స్పీడ్‌గా చొచ్చుకొస్తోంది. వీటితోపాటు చిన్నచితకా పనులు చేయడానికి రోబోటిక్స్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. వీటన్నింటిని బట్టి చూస్తే టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కూడా వాస్తవమే. కానీ దానికి తగ్గట్లు స్కిల్స్ పెంచుకుంటే జాబ్‌కేమీ ఢోకా ఉండదు. టెక్నాలజీకి దూరంగా ఉంటే లాంగ్ రన్‌లో లాస్ అవుతామని కంపెనీలు గుర్తించాయి. అందుకే చాలా కంపెనీలు కస్టమర్‌కు బెస్ట్ సర్వీస్ ఇచ్చి బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ సిస్టం, బిజినెస్ ఇంటిలిజెన్స్ సాఫ్ట్ వేర్లను వాడుతున్నాయి.
అప్‌డేట్ అవడమే మంత్రం
అయితే టెక్నాలజీని వాడుకోవడం వల్ల కస్టమర్ కి క్వాలిటీ సర్వీస్, క్విక్ సర్వీస్ అందితే బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగితే కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా ఓ చైన్ ప్రాసెస్. టెక్నాలజీని భూతంలా చూసి పక్కనపెడితే రేస్‌లో వెనకబడిపోతాం. కంపెనీ అయినా, ఎంప్లాయి అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంప్లాయిస్.. టెక్నాలజీ రివల్యూషన్‌కి తగ్గట్లు అప్‌డేట్ కావడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం, స్కిల్స్ పెంచుకుంటే మీ ఎంప్లాయర్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఉదాహరణకు ఒకప్పుడు టాలీ నేర్చుకుంటే అకౌంటింగ్ జాబ్స్ వచ్చేవి అనుకుందాం. అందులో కొత్త వెర్షన్ వస్తే దాన్ని నేర్చుకుంటే కంపెనీ మిమ్మల్ని తీసుకోవడానికే ముందుకొస్తుంది. ప్రతి సెక్టార్లోనూ ఇదే సూత్రం. మీరు పని చేస్తున్న రంగంలో కొత్తగా ఏం డెవలప్ మెంట్ వస్తుంది తెలుసుకోవడం, వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించడం ఎంప్లాయి తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేకపోతే మీ ఉద్యోగం పోవడానికి ఆటోమేషన్ కూడా అవసరం లేదు.