• తాజా వార్తలు

ఐటీలో అధిక సంఖ్యలో ఉద్యోగాల నిర్మూలన.. మనం తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు 

ఆర్థిక మాంద్యం లేదు లేదంటూ ఓ ప‌క్క ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది.  నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బ‌తింది. రియల్ ఎస్టేట్ ఢ‌మాల్ అంది.  ఇక మిగిలింది ఐటీ సెక్టార్‌. దానికీ మాంద్యం  సెగ తాకుతూనే ఉంది. 

1.  కాగ్నిజెంట్‌లో 13వేల ఉద్యోగాల కోత‌
యూఎస్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ స‌ర్వీసెస్ కంపెనీ లు కాగ్నిజెంట్ ఇప్పటికే 13 వేల ఉద్యోగా తీసేసింది.  


2. ఇంక్రిమెంట్స్ క‌ట్‌.. ప్ర‌మోష‌న్స్ లేవు
మధ్య స్థాయి నుంచి సీనియర్ ఎంప్లాయిస్ వరకు ఇంక్రిమెంట్లు ఆపేసింది. ప్రమోషన్లు వాయిదా వేసింది. ఖర్చు తగ్గించుకోవడానికే కాదు ప్రతిభావంతులకు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు, అందుకే ప్ర‌మోష‌న్లు వాయిదా వేస్తున్న‌ట్లు కాగ్నిజెంట్ సీఈవో బ్ర‌యాన్ హంప్‌హైర్స్ ఎంప్లాయిస్‌కు ఈ మెయిల్ చేశారు. 


3.ఫేస్‌బుక్ ఖాతాలో 6వేల జాబ్స్ ఖాళీ
ఫే
స్‌బుక్‌కు కంటెంట్ మోడరేష‌న్ బిజినెస్‌ను కాగ్నిజెంటే చేసి పెడుతోంది. తాజా ఉద్యోగాల తొల‌గింపులో భాగంగా ఫేస్‌బుక్ మోడ‌రేష‌న్ ప్రాజెక్టులో ప‌ని చేస్తున్న 6వేల మందిని కాగ్నిజెంట్ ఉద్యోగాల నుంచి తొల‌గించింది. దీంతో ఫేస్‌బుక్ మోడ‌రేష‌న్ ప్రాజెక్ట్ నుంచి కాగ్నిజెంట్ బ‌య‌టికొచ్చేసిన‌ట్లే.  

4. సీనియ‌ర్ల‌కే దెబ్బ‌
కాగ్నిజెంట్‌లో ప్ర‌ధానంగా మ‌ధ్య‌స్థాయి నుంచి సీనియ‌ర్ స్థాయి ఉద్యోగుల‌పైనే లే ఆఫ్స్ ప్ర‌భావం భారీగా ప‌డ‌నుంది.  వీరికి భారీ జీతాలే త‌ప్ప ప‌నిలో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేద‌ని కంపెనీ భావిస్తోంది. 


5. ఇండియాలోనే అధిక ప్ర‌భావం
కాగ్నిజెంట్‌కు ఇండియాలో 2 ల‌క్ష‌ల 90 వేల మంది ఐటీ ఎంప్లాయిస్ ఉన్నారు. ఇది మొత్తం కంపెనీలో 70%.  ఇండియ‌న్ ఎంప్లాయిస్ తొల‌గింపు జాబితాలో ఎక్కువ‌గా ఉండ‌బోతున్నారు.  

6. హైరింగ్ కొన‌సాగుతోంది
మ‌రోవైపు కొత్త టాలెంట్‌ను హైర్ చేసుకోవ‌డం కొన‌సాగిస్తామ‌ని కాగ్నిజెంట్ చెబుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5వేల మందిని  హైర్ చేసుకోబోతోంది.

7. కాస్ట్ క‌టింగ్‌కే జాబ్స్ తొల‌గింపు
బ్ర‌యాన్ హంప్‌హైర్స్ ఏప్రిల్‌లో సీఈవో అయ్యాక కాగ్నిజెంట్‌లో కాస్ట్ క‌టింగ్‌పై దృష్టి పెట్టారు. డైరెక్టర్లు అంత‌కంటే పెద్ద ప‌ద‌వుల్లో ఉద్యోగులు పెరిగిపోయార‌ని, దీంతో నిర్వ‌హ‌ణ వ్య‌యం పెరిగిపోతోందని బ్ర‌యాన్ భావిస్తున్నారు. అందుకే ఇక్క‌డి నుంచే కోత మొద‌లైంది.  

8. జీతాల్లోనూ మార్పులు
ఉద్యోగాల కోతే కాదు.. శాల‌రీ స్ట్రక్చ‌ర్‌లోనూ కాగ్నిజెంట్ మార్పులు మొద‌లుపెట్టింది. ముందుగా సేల్స్‌టీమ్‌తో దీన్ని ప్రారంభించింది.


9. మారండి లేదా మారిపోండి
ప్రొడ‌క్టివిటీ పెరిగి కంపెనీ లాభాల్లోకి వ‌చ్చేలా మిమ్మ‌ల్ని మీరు మార్చుకోండి లేదంటే జాబ్ మార‌డానికి సిద్ధంగా ఉండండి అంటూ బ్ర‌యాన్ తాను సీఈవో అయిన వెంట‌నే కాగ్నిజెంట్ ఎంప్లాయిస్ అంద‌రికీ స్ట్రాంగ్‌గా ఓ ఈ మెయిల్ కొట్టేశాడు.

10. వాలంట‌రీ సెప‌రేష‌న్ 
సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్స్‌, డైరెక్ట‌ర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్‌, వైస్ ప్రెసిడెంట్స్‌ను ముందే సాగ‌నంపే వాలంట‌రీ సెప‌రేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కూడా కాగ్నిజెంట్ స్టార్ట్ చేసింది. 


 

జన రంజకమైన వార్తలు