అన్‌లిమిటెడ్ టాక్ టైమ్.. ఇది ఫోన్లు ఉపయోగించే వారికి బాగా పరిచయం ఉన్న మాట. కానీ అన్‌లిమిటెడ్ శాలరీ!! ఇది మనం ఎప్పుడూ వినలేదు. అన్‌లిమిటెడ్ శాలరీ ఇస్తే ఎగిరి గంతేసి వెంటనే ఆ జాబ్ కోసం ప్రయత్నించేయరూ! కానీ ఈ ఆఫర్ మన దేశంలో కాదు.. చైనాలో! అదీ తక్కువ శాలరీలు ఇస్తారనే పేరు సంపాదించుకున్న ఈ బడా దేశంలో! ఆ దేశానికి చెందిన బైట్ డ్యాన్స్ అనే స్టార్టప్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఏమా ఆఫర్.. ఏమా కథ!
అన్‌లిమిటెడ్ టాలెంట్..
బైట్ డాన్స్ సంస్థకు అన్‌లిమిటెడ్ టాలెంట్ ఉన్న ఉద్యోగులు కావాలి. దీని కోసం అన్‌లిమిటెడ్ శాలరీ ఇస్తామని ప్రకటించేసింది. దీంతో వందల సంఖ్యలో ఉద్యోగార్థులు ఈ కంపెనీ గుమ్మం ముందు క్యూ కట్టారు. జాంగ్ ఇమింగ్‌కు చెందిన ఈ సంస్థ హెవీ టాలెంట్ ఉన్న వాళ్ల కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది. జిన్‌రి టొటినో అనే మొబైల్ యాప్‌కు ఈ కంపెనీ బాగా ప్రసిద్ధి. ఈ యాప్ ద్వారా ఆ రోజు కీలక వార్తలు, వీడియోలు, కథనాలు అందిస్తుంది. దీని కోసం అన్ని వార్త సంస్థలతో టై అప్ చేసుకుంది. గత ఐదేళ్లలో ఈ యాప్ మోస్ట్ పాపులర్‌గా మారిపోయింది. ఈ యాప్‌ను రోజూ 120 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారంటే ఈ యాప్ ప్రాచుర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
శాలరీ... నో కాంప్రమైజ్!
బై డాన్స్ శాలరీల విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు. ఒక్కోసారి ఏకంగా 50 శాతం శాలరీ హైక్‌ను ప్రకటించేస్తుంది. ఈ ఏడాది 2.5 బిలియన్ డాలర్ల ఆదాయన్ని పొందిన ఈ సంస్థకు డబ్బుప్రధానం కాదు వీలైనంత ఎక్కువ పేరు సంపాదించుకోవడమే ముఖ్యం. యాడ్స్ ద్వారానే ఈ సంస్థకు భారీగా ఆదాయం వస్తుందట. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం 20 బిలియన్ల వరకు ఉంటుందట. కంపెనీలో టాప్ ఫెర్ఫార్మర్‌లుగా ఉన్న వారికి 1 మిలియన్ డాలర్ల శాలరీతో పాటు బోనస్‌ను అదనంగా ఇవ్వనున్నారు. బై డాన్స్ మాత్రమే ఇటీవలే మొదలైన ఒక అంకుర సంస్థ కూడా అన్‌లిమిటెడ్ శాలరీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే ఇన్ లిమిటెడ్ శాలరీ అందుకోవాలంటే వారు టాలెంట్ అన్‌లిమిటెడ్‌గా ఉండాలనే షరతు విధిస్తున్నాయి ఈ సంస్థలు.