అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని భారత్‌లో సాఫ్ట్‌వేర్ జోరుకు బ్రేక్ పడింది. అమెరికాకు వెళ్లే వారికి, ప్రస్తుతం అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా నియమ నిబంధనలు కఠినతరం చేయడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్న చాలామంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికే వీసా గడువు ముగిసిన చాలామందిని అక్కడ కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఈ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. ఎక్కడ ఉద్యోగులు అక్కడే ఆగిపోయారు. మళ్లీ మన దేశంలోనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సాఫ్ట్‌వేర్ రంగంలో ఊపు తగ్గడంతో ఇక్కడ కంపెనీలు కూడా ఒకేసారి వందల సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చి ఇంటికి పంపించేశాయి. దీంతో డాలర్ డ్రీమ్స్‌లో ఉన్న కుర్రకారు కలలన్నీ కల్లలయ్యాయి. అయితే ఈ స్థితిలో నిరుద్యోగులకు చల్లటి కబురు అందింది. ఐటీ సెక్టార్‌లో చాన్నాళ్ల తర్వాత భారీ ఉద్యోగాల మేళా వచ్చేసింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేశాయి
ఇన్ఫోసిస్‌లో 20 వేలు.. ఎల్ అండ్ టీలో 2 వేలు
అసలే ఉద్యోగాలు దొరక్క బీటెక్ బాబులంతా రోడ్ల మీద తిరుగుతుంటే వారి కోసమే అన్నట్లుగా ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్‌లో 20 వేల మందిని, ఎల్ అండ్ టీ కంపెనీలు 2 వేల మంటి ఐటీ నిపుణులను తీసుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇంకా మంచి విషయం ఏమిటంటే గతంలో లాగే క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించి ప్రతిభావంతుల్ని ఎంపిక చేసుకుంటామని ఈ రెండు ఐటీ దిగ్గజాలు తెలిపాయి. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు అవసరాల దృష్ట్యాల డిజిటల్, ఎనలైటిక్స్ మీద పట్టు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని ఇన్ఫోసిస్ చెప్పింది. సంప్రదాయబద్ధంగా ఉద్యోగులను ఎంపిక చేసే విధానానికి ఎప్పుడో కాలం చెల్లిందని నైపుణ్యంతో పాటు తెలివితేటలు, కష్టపడే స్వభావం ఉన్నవారికి మంచి జీతం ఉంటుందని ఈ సంస్థలు చెబుతున్నాయి.
రెండేళ్ల కాలానికి...
వచ్చే రెండేళ్ల కాలానికి సరిపడగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తెలిపింది. తాజాగా 1500 నుంచి 2000 వరకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పింది. క్యాంపస్ ఇంటర్యూలను నిర్వహించి ప్రతిభకు పట్టం కడతామని చెప్పింది. ఐతే సరైన క్యాండిడేట్ దొరికతే ఎంత పే ఇచ్చయినా వారిని కంపెనీలోకి తీసుకోవడానికి ఈ రెండు సంస్థలు వెనుకడట్లేదు. అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్‌తో పాటు మేథస్సు ఉన్నవారికి పెద్ద పీట వేస్తామని ఎల్ అండ్ టీ తెలిపింది. మరోవైపు ఐబీఎం కూడా కొత్త ఎంప్లాయ్‌ల నియమాకంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆ కంపెనీ 5 వేల మందిని ఉద్యోగంలోంచి తీసేసిందనే వార్తలు వచ్చాయి.. ఈ వార్తలను ఖండిచించిన ఐబీఎం కొత్త ఉద్యోగుల నియమాకంపై దృష్టి సారించినట్లు పేర్కొంది.