టెక్నాలజీ సెక్టార్‌లో నారీ భేరి మోగుతోంది. నిజమే ఈ రంగంలో మహిళలకు మంచి ప్రాతినిధ్యమే దొరుకుతోంది. ఇండియాలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్నాలజీయేనట. నాస్కామ్ యూకేకు చెందిన ఓపెన్ యూనివర్సిటీతో కలిసి రూపొందించిన ఓ నివేదికలో ఈ విషయాన్ని ప్రకటించింది. ఇండియాలో ఐటీ-బీపీఎం సెక్టార్‌లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాలు ఎంత వరకు ఉన్నాయనేది అంచనా వేయడానికి ఈ రిపోర్ట్‌ను తయారుచేశారు.
ఇండియాలో ఐటీ- బీపీఎం సెక్టార్టకు దాదాపు పదిహేనేళ్లుగా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ ఇంటర్మీడియట్ చదివే వారిలో అత్యధిక మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చదవాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలి వంటి యాంబిషన్స్‌తోనే ఉంటున్నారు . దానికి తగ్గట్లుగానే టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో అమ్మాయిల సక్సెస్ రేటు అబ్బాయిల కంటే బాగుంది. ఫలితంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌గా, ఐటీ, బీపీవోల్లోనూ వారికి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఈ రిపోర్ట్‌లో అదే విషయం ప్రస్ఫుటంగా కనిపించింది.
మూడో వంతు మహిళలే..
ఇండియాలో ఐటీ - బీపీఎం సెక్టార్‌లో దాదాపు 39 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో మూడోవంతు అంటే 13 లక్షల మంది ఎంప్లాయిస్ మహిళలేనని నాస్కామ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సంగీతా గుప్తా చెప్పారు. ఈ సెక్టార్లో స్త్రీల స్థితిగతులు, వారికి ఎదురవుతున్న సవాళ్లేమిటి? మహిళలను ఐటీ- బీపీఎం సెక్టార్లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? అనే విషయాలు తెలుసుకోవాలనేదే ఈ రిపోర్ట్ తయారు చేయడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం అని ఆమె చెప్పారు.
నివేదికలో కొన్ని కీలకాంశాలు
* 2017 నాటికి ఐటీ - బీపీఎం సెక్టార్లో మహిళలు సీనియర్ లెవెల్ ఉద్యోగాల్లో ఉన్న కంపెనీల సంఖ్య 60 శాతానికి పెరిగింది.
* 51 శాతం కంపెనీలు సి- సూట్ లెవెల్ లో 20 శాతం మందికి పైగా మహిళా ఉద్యోగులను కలిగి ఉన్నాయి.
* కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 10 శాతానికి పైగా మహిళలున్న కంపెనీలు 2.5 నుంచి 5% వరకు ఎక్కువ లాభాలు సాధిస్తున్నాయి