• తాజా వార్తలు

ఫ్లిప్ కార్టు వద్దన్న కుర్రాడికి కోకొల్లలుగా ఉద్యోగాలు

“నన్ను కొనుక్కోండి”-- ఆకాశ్ మిట్టల్

బుర్ర ఉండాలే కానీ అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టం కాదని నిరూపించాడు ఆ ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొని తిరస్కారానికి గురైన ఆకాశ్ మిట్టల్ అనే ఈ విద్యార్థి ఆ తరువాత సంచలనం సృష్టించాడు. తన ఉద్యోగ దరఖాస్తు తిరస్కారానికి గురైనా ఆయన నిరుత్సాహపడలేదు. సృజనాత్మక రీతిలో అదే వెబ్‌సైట్‌లో తనను తాను అమ్మకానికి పెట్టుకొంటూ బయోడాటాను పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన బయోడాటా ఆన్‌లైన్‌లో వైరల్‌గా స్ప్రెడ్ అయింది. ఇంకేముంది ఉద్యోగం కోసం కంపెనీల తలుపు తట్టాల్సిన అవసరం లేకుండానే ఉద్యోగాలే కుప్పులుతెప్పలుగా ఆయన ముందు వాలాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఓషన్ ఇంజినీరింగ్‌లో ఐదో ఏడాది ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న ఆకాశ్‌కు లెక్కలేనన్ని జాబ్ ఆఫర్లు వచ్చాయి. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌తోపాటు పలు రకాల ఉద్యోగాలు ఇవ్వడానికి వివిధ కంపెనీలు క్యూ కట్టాయి.  ప్రస్తుతం వాటిలో నుంచి తన విద్యార్హతలకు సరిపోయే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు. గ్రేడింగ్ విధానంలో ఆరుపాయింట్లు ఉన్న తనకు ఉద్యోగం రావడం కష్టమనుకున్న ఆయన తెలివిగా, క్రియేటివ్ గా ఇలాంటి ఎత్తుగడతో ఎంప్లాయర్లను ఆకట్టుకున్నాడు.  ఇంకో విషయం ఏంటంటే ఫ్లిప్ కార్డు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన ఈ ఆకాశ్ రాసిన ''ఇట్ వజ్ నాట్ హెర్ ఫాల్ట్' అనే పుస్తకం కూడా ఫ్లిప్‌కార్ట్ లో తెగ సేల్ అవుతోంది. అమెజాన్‌లో కూడా అది టాప్ సెల్లర్లలో ఒకటి.

 

జన రంజకమైన వార్తలు