పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. కోడింగ్ లో నైపుణ్యాలను కలిగి ఉన్నవారికే అత్యధిక జీతం ఉంటుంది. అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజేస్ సెలక్ట్ చేసుకోవడానికి.....కోడింగ్ కు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదాని గురించి తెలుసుకోవడం మంచిది. కోడింగ్ ఔత్సాహికులు ఈ పది ప్రోగ్రామింగ్ భాషలను నేర్చుకున్నట్లయితే...టెక్ కంపెనీలకు మీరే మోస్ట్ వాంటేడ్ కావొచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ లో ఉన్న టాప్ 10 ప్రోగ్రామింగ్ భాషలు మీకోసం .....
1. Python...
ఇది నెంబర్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ప్రక్రియ ఆధారిత ప్రోగ్రామింగ్ తోపాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. C లేదా C++వంటి ఇతర్ ప్రోగ్రామింగ్ భాషలతో పొందుపరిచినప్పుడు స్క్రిప్టింగ్ కెపాసిటిని అందిస్తుంది. పైథాన్ అప్లికేషన్స్ ను సైంటిఫిక్ట్ , న్యూమరిక్ కంప్యూటింగ్, ఇమేజ్ ప్రొసెసింగ్, గ్రాఫిక్ డిజైన్ అప్లికేషన్స్ కోసం ఉపయోగపడుతుంది. వెబ్ అప్లికేషన్ ప్రేమ్ వర్క్ లోనూ క్రియేట్ చేసేందుకు లూనిక్స్ పంపిణీల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
2.JavaScript....
జావాస్క్రిప్ట్ అనేది ఫంక్షనల్ లేదా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రొగ్రామింగ్ మెథడాలజీలను సెలక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్స్ అందించేందుకు క్రియేట్ చేయబడింది. జావాస్క్రిప్ట్ గురించి అవగాహన ఉంటేనే వెబ్ అప్లికేషన్ లేయర్ ను నిర్వహించవచ్చు. ఇది వెబ్ సైట్ల కోసం ఇంటర్ స్పేసును అందిస్తుంది. పేర్ల్, PHP వంటి ఇతర ప్రోగ్రామింగ్ భాషలతో కలిపి ఉపయోగించవచ్చు. అంతేకాదు చిన్న స్థాయి గేమ్స్, యాప్స్ ను క్రియేట్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.
3.C#...
ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను మైక్రోసాఫ్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇది జావాకు గట్టిపోటీనిస్తోంది. దీని ఇన్ బిల్ట్ నిర్మాణం మొత్తం కూడా పెద్ద సంఖ్యలతో డెవలప్ చేయబడింది. సి షార్ప్ అందించే ఫీచర్లలో ఇది ఒకటి. ఇది ఆటోమేటిక్ స్కేలింగ్, అప్ డేట్స్ ను అందిస్తుంది. C++మరియు జావా నుంచి కొన్ని ప్రిన్సిపుల్స్ ను తీసుకుంటుంది. వెబ్ డెవలప్ మెంట్ కోసం asp వంటి యాప్స్ తో సి షార్ప్ ను ఉపయోగిస్తారు
4.Java...
అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ భాషలలో జావా ఒకటి. ప్రపంచంలోని మూడు బిలియన్ల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లలో జావా ప్రాపర్ ఫంక్షనింగ్ ను ఉపయోగిస్తున్నారు.
జావాలో ఉన్న లైబ్రరీ విస్తృత పరిధి కలిగినది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిమితులకు అతీతంగా ప్రోగ్రాంల అమలు దీనితో సాధ్యమౌతుంది. ప్రోగ్రాములు 'బైట్‌కోడ్'గా పరివర్తనం చెయ్యడం వల్ల ఎటువంటి వాతావరణంలోనైనా ప్రోగ్రామ్‌లు అమలుపరచగలిగిన అనుకూలతలు. స్వతంత్రంగా మెమరీ నిర్వహణ చేసుకోగలదు. ఇంటర్నెట్ వంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లకూ, డెస్క్‌టాప్‌పై గ్రాఫిక్ ఆధారిత అప్లికేషన్‌ల అభివృద్ధికీ అనువైనది. మొబైల్ ఆధారిత ప్రోగ్రాముల అభివృద్ధికి అవసరమైన లైబ్రరీలు పుష్కలంగా ఉన్నాయి. జావా ఆధారంగా పనిచేసే అన్ని పరికరాల్లోనూ జే2ఎంఈ ఫ్రేమ్‌వర్క్ సహాయంతో ప్రోగ్రాములు అభివృద్ధి చేయవచ్చు. ఫోన్ల అప్లికేషన్ల అభివృద్ధి కూడా సులభం.
5.SWIFT....
అత్యంత వేగంగా చదవగలిగే ప్రోగ్రామింగ్ భాషలలో స్విఫ్ట్ ఒకటి. ఇది ఒక ఓపెన్ సోర్స్ భాషగా ఉంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటుంది. స్విఫ్ట్ అందించే ఫీచర్లలో ఒకటి. మీరు స్విఫ్ట్ లో ఒక కోడ్ రాసినట్లయితే...అది ఆటోమెటిగ్గా పరిష్కరిస్తుంది. కోడ్లో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించినట్లయితే...మీ సమయం, డబ్బును తగ్గిస్తుంది. అంతేకాదు స్విఫ్ట్ మిక్స్ డ్ కోడ్ బేస్ ను కలిగి ఉన్న యాప్స్ ను డెవలప్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఐఓఎస్, మ్యాక్, ఓఎస్టి వెర్షన్స్ కోసం యాప్స్ డెవలప్ చేస్తుంది. వెబ్ సైట్లు, యాప్స్ కోసం వెబ్ ఫ్రేమ్ వర్క్స్ ను రూపొందించడానికి ఉపయోగించే ఆన్ లైన్ కంపైల్లర్లు మరియు వెబ్ సైట్లలో కూడా ఇది ఉపయోగించబడుతుంది.
6.GO....
గో...మార్కెట్లో ఉన్న అత్యధిక ప్రోగ్రామింగ్ భాషల కంటే వేగంగా పని చేస్తుంది. అంతేకాదు స్ట్రాంగ్ లైబ్రరీ కూడా ఉంది.ఇన్ బిల్ట్ టెస్టింగ్ సపోర్ట్ అనేది ముఖ్యమైన ఫీచర్. ఇది ప్రోగ్రామింగ్ ప్రొడక్టివిటిని పెంచుతుంది. సి మరియు సి ప్లస్ ప్లస్ వంటి ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజేస్ తో పోలిస్తే...ఇది చాలా ఈజీగా మెమరీని అందిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ప్రాసెసింగ్ పవర్ సప్లై చేయబడే యాప్స్ లో గో ఉపయోగించబడుతుంది. ఇది స్టాటిక్, డైనమిక్ కంటెంట్ రెండింటినీ అందిస్తున్న వెబ్ సైట్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
7.R...
ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఉండటంతో...ఆర్ సోర్స్ కోడును యాక్సెస్ చేయడానికి....భాషలో అవసరమైన మాడిఫికేషన్స్ చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాదు స్టాటిస్టికల్ టెక్నిక్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సమాచార విశ్లేషణతోపాటు గణిత శాస్త్ర యాప్స్ లో ఆర్ భాషను వాడుతారు. యునిక్స్, విండోస్ లేదా మాక్, ఓఎస్ వంటి విస్త్రుత శ్రేణి అపరేటింగ్ సిస్టమ్ లో మెర్జ్ చేయబడుతుంది.
8.Scala...
జావా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి స్కాలాను రూపొందించారు. ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మరియు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఈ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. స్కాలా ద్వారా టైప్ చేసిన భాషను వేరియబుల్ కోసం సెట్ చేయలేరు. అంతేకాదు మార్పులు కూడా చేయలేరు. జావా బేర్ కోడ్లో కంపైల్ చేయబడుతుంది. జావా వర్చువల్ మెషిన్లో అమలు చేయబడుతుంది. స్కలా భాషను డేటా విశ్లేషణ కోసం ఉపయోగిస్తారు.
9.Ruby..
రూబీ అనేది ఒక ఉచిత ఫార్మాట్ భాష. ఇది ఏదైనా లైన్ లేదా నిలువు వరుస నుంచి కోడ్ రాయడానికి అనుమతిస్తుంది. దీన్ని డైనమిక్ భాష అని కూడా అంటారు. రన్ టైమ్ లో టైప్ చెకింగ్ కూడా చేయవ్చు. రూబీ సర్వర్ సైడ్, స్క్రిప్టింగ్, కాన్ఫిగరింగ్ మేనేజ్ మెంట్ కోసం ఉపయోగించబడుతుంది. ఇది ఎంబెడెడ్ సిస్టమ్ లో , మెండింగ్ మెషీన్లు, పారిశ్రామిక రోబోట్లు, నెట్ వర్క్ రౌటర్లలో ఉపయోగిస్తారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ల కోసం లోకల్ యాప్స్ ను రూపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది.
10.PHP..
ఆపరేటింగ్ సిస్టమ్ తో ఎలాంటి సంబంధం లేకుండా, డేటాబేస్ మేనేజ్ మెంట్ కోసం PHPభాష ఉపయోగపడుతుంది. యునిక్స్, విండోస్, లూనిక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో పనిచేస్తుంది. అర్థవివరణ అనేది PHP భాష యొక్క మెయిన్ ఫీచర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో PHPలో అవసరంలేని సంవధాన ప్రక్రియలో కోడ్ యొక్క ప్రతి లైన్ కోడ్ ను మార్చడానికి అవసరం అవుతుంది. ఇంటర్ నెట్లో అన్ని వెబ్ సైట్లలో 82శాతం సర్వర్ వైపు ప్రోగ్రామింగ్ కోసం PHPను ఉపయోగిస్తారు. ఓరాకిల్, POP3. MYSQLవంటి ప్రోటోకాల్ల సంఖ్య అనేక డేటా బేస్ లకు సపోర్ట్ చేస్తుంది.