సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యూత్‌కు ఎప్పడూ టార్గెట్టే. ఐదు రోజులు పని, వీకెండ్ ఎంజాయ్‌మెంట్, కష్టపడితే మంచి గుర్తింపు, లక్షల్లో జీతాలు.. ఇలా ఆ జాబ్‌కు ఉన్న ప్లస్‌పాయింట్లు చాలానే ఉన్నాయి. అందుకు ఇంజినీరింగ్ చదువుతున్నప్పటి నుంచే కోర్సులు నేర్చుకుంటున్నారు. క్యాంపస్ సెలెక్షన్స్‌లోనే జాబ్ కొట్టేయాలని కష్టపడుతున్నారు. ఈ ఉద్యోగాల వేటలో ఉండే యూత్‌కి ఇప్పుడు విజువల్ టెక్నికల్ రెజ్యూమ్ (వీటీఆర్) కూడా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతానికి ఇది యాడెడ్ అడ్వాంటేజే గానీ భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ జాబ్‌లకు ఈ వీటీఆర్ తప్పనిసరి కావచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. అందుకే మరి ఆ విషయంలో వెనకబడిపోకుండా విజువల్ టెక్నికల్ రెజ్యూమ్ ఎలా తయారుచేసుకోవాలో మీ ముందుకు తెచ్చింది కంప్యూటర్ విజ్ఞానం.
వీటీఆర్ అంటే?
విజువల్ టెక్నికల్ రెజ్యూమ్ అంటే జస్ట్ మీ రెజ్యూమ్‌ను కాస్త టెక్నికల్‌గా ప్రజంట్ చేయడం. అంటే మీకు సీ, సీ++, జావా లాంగ్వేజెస్ వచ్చు. అవి మీరు ఐ హావ్ నాలెడ్జ్ ఆన్ సీ, సీ++ లాంగ్వేజెస్ అని చెప్పకుండా దాన్ని చిన్న చిన్న గ్రాఫిక్స్ రూపంలో ప్రజంట్ చేయడం. టెక్నాలజీతో బాగానే టచ్ ఉంది. అప్‌డేట్స్ ఫాలో అవుతుంటారు అని మీ గురించి కంపెనీలు అనుకోవడానికి ఈ వీటీఆర్ బాగా ఉపయోగపడుతుంది.
గిట్ హబ్ రిపోజట్రీస్‌తో ఉచితంగా
గిట్ హబ్ రిపోజట్రీస్ మీద ఇలా విజువల్ టెక్నికల్ రెజ్యూమ్ (వీటీఆర్)ని సొంతంగా క్రియేట్ చేసుకోవడానికి ఉచిత సర్వీసులు కూడా ఉన్నాయి. Sourcerer.io అనే సర్వీస్‌తో మీరు ఫ్రీగా వీటీఆర్ క్రియేట్ చేసుకోవచ్చు.
1) https://sourcerer.io/join అని బ్రౌజర్‌లో టైప్ చేయండి. Let's begin అనే పేజీ వస్తుంది. దీనిలో కింద Build with GitHub, Build with app అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
2) ఇప్పటికే మీకు GitHub అకౌంట్ ఉంటే Build with GitHub ఆప్షన్ క్లిక్ చేయండి. లేకపోతే అదే ఆప్షన్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే Build with app ఆప్షన్‌తో ట్రై చేయండి.
3) బిల్డ్ విత్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక ఈ సర్వీస్ మీ గిట్‌హబ్ రిపోజట్రీస్ డేటాను యూజ్ చేసుకుని మీ విజువల్ టెక్నికల్ రెజ్యూమ్‌ను క్రియేట్ చేస్తుంది. దానిలో మీకు వచ్చిన లాంగ్వేజ్‌లు, లైన్ ఆఫ్ కోడ్స్ ( LOC), commits అన్నీ గ్రాఫిక్స్ రూపంలో కనిపిస్తాయి.
4) ఓవర్ వ్యూలో ప్రతి నెలా మొత్తం కమిట్స్, LOC ఎన్నో ప్రత్యేకంగా చూపిస్తుంది.
5) ఇవన్నీ సరిచూసుకున్న తర్వాత కావాలంటే ఈ విజువల్ టెక్నికల్ రెజ్యూమ్‌ను PDF, DOC, DOCX వంటి ఫార్మాట్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే యూఆర్ఎల్ సెండ్ చేసినా సరిపోతుంది.