భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశం లోని అనేక రంగాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని రంగాలూ దీని ప్రభావానికి లోనయ్యాయి. అయితే 2017 వ సంవత్సరం లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందా? వివిధ రంగాలపై దీని ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? వివిధ రంగాలలోని ఉద్యోగాలపై ఇది ఎలాంటి ప్రభావాలను చూపనుంది? సదరు కంపెనీల అధిపతులు లేదా ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అనే అంశాలపై ఒక విశ్లేషణ ను ఈ వ్యాసం లో చర్చిద్దాం.
1. ఈ కామర్స్/ స్టార్ట్ అప్ లు
ప్రస్తుత పరిస్థితి: గత సంవత్సరం ఈ కామర్స్ రంగానికి ఏమంత కలిసిరాలేదు. ఫుడ్ డెలివరీ స్టార్ట్ అప్ లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యి రెవిన్యూ లోటు ను చవిచూశాయి. .అయినప్పటికే ఈ స్టార్ట్ అప్ లు తమ సౌకర్యం మరియు వినియోగదారుని అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఈ రెవిన్యూ తో సంబంధం లేకుండా తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్ ఈ కామర్స్ రంగానిదే కదా!
ఉద్యోగ కల్పన: ఫెస్టివల్ సీజన్ ను సద్వినియోగం చేసుకుని వీలైనన్ని ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఉద్దేశం తో ఈ కంపెనీలు జూలై- అక్టోబర్ ల మధ్య సమయం లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఫెస్టివ్ సీజన్ తర్వాత సమయం కావడం మరియు డీ మానిటైజేషన్ ప్రభావం నేపథ్యం లో 2017 వ సంవత్సరం లో ఈ ఉద్యోగ కల్పన అనే ప్రక్రియ కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది. కానీ ప్రోడక్ట్ అండ్ టెక్నాలజీ, ఫ్రంట్ లైన్ మరియు అనలిటిక్స్ విభాగాలలో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల మాట: ఈ కామర్స్ అనేది వనరులను మరియు ధర లను సరిగా ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకుంటూ ఇప్పుడిప్పుడే వృద్ది చెందుతున్న పరిశ్రమ. ఇప్పుడిప్పుడే రిటైలర్ లు ఎక్కువమంది ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం పై తమ కార్యకలాపాలను విస్తరిస్తూ ఈ రంగానికి అవసరమైన మానవ వనరులను అందిస్తున్నారు.
2. తయారీ రంగం / ఆటో మొబైల్
ప్రస్తుత పరిస్థితి: తయారీ రంగాన్ని ప్రత్యేకించి ఆటో మొబైల్ రంగాన్ని ఈ డీ మానిటైజేషన్ తీవ్ర ప్రభావానికి గురిచేసింది. చిన్నా, పెద్దా యంత్రాల అమ్మకాలన్నీ గ్రామీణ ప్రాంతాలలో నగదు ఆధారంగా గానే జరుగుతాయి. అయితే ఒక్కసారి గా పెద్ద నోట్లు రద్దు కావడం తో ఈ అమ్మకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ బ్యాంకు లలో సరిపడినంత డబ్బు అందుబాటులోనికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగ కల్పన: నోట్ల రద్దు ప్రకటన నేపథ్యం లో సహజం గానే ఉద్యోగ కల్పన అనేది కొంచెం నెమ్మదించే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల మాట: తయారీరంగం లోని కంపెనీలు నైపుణ్య లేమి సమస్య తో సతమతవుతున్నాయి. ఓపెన్ పొజిషన్ లకు అర్హత మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకడం కష్టం అయిపొయింది. స్కిల్ డెవలప్ మెంట్ అనేది అభివృద్ధి నిరోధకాలలో ఒకటిగా నిలిచింది.
3. IT/ ITes
ప్రస్తుత పరిస్థితి: 9% వృద్ది రేటుతో భారత IT రంగం యొక్క పరిస్థితి కొంచెం ఆశాజనకంగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారo ప్రకారం గత సంవత్సరం ఉన $ 146 బిలియన్ల రెవిన్యూ కు ఈ సంవత్సరం $20లు అదనంగా రాబట్టాలను ఈ రంగం భావిస్తుంది. డేటా సైన్సెస్, అల్గోరిథం డిజైన్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి రంగాలలో కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయనున్నాయి. అమెరికా యొక్క ఇమ్మిగ్రేషన్ మరియు వీసా నిబంధనలు ఇండియన్ IT సెక్టార్ ను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చెప్పడం ప్రస్తుతానికి అప్రస్తుతమేమో అనిపిస్తుంది.
ఉద్యోగ కల్పన: గత ఆరు నెలల తో పోల్చి చూసుకుంటే 2016 అక్టోబర్ మరియు 2017 మార్చి మధ్య కాలo లో ఉద్యోగ కల్పనలో ఊహించిన రీతిలోనే పెరుగుదల కనిపించింది. ఆటోమేషన్, మరియు అప్ స్కిల్లింగ్ ఫలితంగా ఉద్యోగాలలో కోత విధించే పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఉన్నతాధికారుల మాట: సుమారు 75 శాతం ఇండియన్ కంపెనీలు రానున్న ఆరు నెలల కాలంలో తమ హెడ్ కౌంట్ ను పెంచుకోనున్నాయి. పరిశ్రమ లో పోటీ తత్త్వం పెరగనుంది. ఈ ఎడ్జ్ ను ఇలాగే కొనసాగించాలి అంటే వాల్యూ ప్రపోజిషణ్ చాలా అవసరం.
4. ఫార్మా
ప్రస్తుత పరిస్థితి: ఫార్మా పరిస్థితి ఆశాజనకం గానే ఉంది. రానున్న 3 సంవత్సరాలలో ఇది 12% వృద్ది రేటును సాధించి 2,40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తుంది. 2020 కల్లా వృద్ది రేటు పరంగా ప్రపంచం లోని టాప్ 3 ఫార్మా మార్కెట్ ల్సలోప్ ఒకటిగా , అలాగే పరిమాణం పరంగా టాప్ 6 లో ఒకటిగా నిలవడానికి ఇండియా శాయశక్తులా పనిచేస్తుంది.
ఉద్యోగ కల్పన: ఈ రంగం ఆశిస్తున్న వృద్ది రేటును పరిగణన లోనికి తీసుకుంటే ఫార్మా రంగం లో ఉద్యోగాలు వెల్లువలా ఉండనున్నయనేది అర్థం అవుతుంది. అయితే కంపెనీల అంచనాకు తగిన అర్హత లు కలిగిన అభ్యర్థులు మన దేశం లో ఉన్నారా లేదా అనేదే ప్రశ్నార్థకం గా మారింది. అందుకే కొన్ని ప్రత్యెక స్థానాలకు విదేశీ ఉద్యోగులను నియమించే ఆలోచనలో ఈ కంపెనీలు ఉన్నాయి. సేల్స్ అండ్ ప్రోడక్ట్ లో అత్యధిక డిమాండ్ ఉన్న నేపథ్యం లో ఉన్నత స్థాయిలో నైపుణ్యాలు కలిగిన R&D మరియు ఇన్నోవేషన్ ప్రొఫెషనల్ లు అవసరం ఉన్నది. ఈ స్థాయిలో నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు దొరకడం మన ఇండియన్ జాబు మార్కెట్ లో కొంచెం కష్టం తో కూడుకున్నదే. అయితే ఈ రంగం లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఈ అంశాన్ని దృష్టి లో ఉంచుకుని తమ నైపుణ్యాలను మెరుగు పరచుకుంటే మాత్రం వారి భవిష్యత్ బంగారుమయం కావడం తధ్యం అనిపిస్తుంది. ఏది ఏమైనా 2017 యొక్క మొదటి అర్థభాగం లో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల మాట: ఆరోగ్య రంగం పై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ద, మరియు మెడికల్ ఎడ్యుకేషన్ ను వృద్ది చేసే దిశగా చర్యలు తీసుకోవడం లాంటివి చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ ఫార్మా రంగం మరింత వృద్దిని సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా వ్యాపారానికి మరియు ఉద్యోగ కల్పనకు అనువుగానే ఉంది.
5. టెలికాం
ప్రస్తుత పరిస్థిత: టెలికాం రంగం లో ప్రస్తుతం ఉన్న ఆపరేటర్ లందరూ తమ నెట్ వర్క్ లను 3 జి మరియు 4 జి లకు విస్తరించుకుంటున్నారు. ఫైబరైజేషన్ ప్రక్రియ ద్వారా ఈ నెట్ వర్క్ లను విస్తరించడం అనేది జరుగుతుంది. GSM అసోసియేషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం ప్రపంచం లోనే ఇండియా 4 వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించింది. కానీ గత సంవత్సరం ఈ పరిశ్రమ యొక్క వ్యాపార వృద్ది కేవలం ఒక శాతానికే పరిమితం అయింది.
ఉద్యోగ కల్పన: కంపెనీ లు టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, మరియు మొబైల్ యాప్ డెవలప్ మెంట్ లపై అధిక దృష్టిని ఉంచడం చూస్తుంటే ఉద్యోగకల్పన భారీ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 4 వగ్ తన విస్తృతిని మరింత పెంచుకున్నది. అతి త్వరలోనే 5 జి టెక్నాలజీ కూడా రానున్న నేపథ్యం లో ఈ రంగo లో అవకాశాలు మరింత పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం అధిక సంఖ్య లో ఉద్యోగాలు డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా వచ్చే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల మాట: ఉద్యోగ కల్పన అనేది కంపెనీలకు ముఖ్యంగా మారనుంది. e- KYC కి సంబంధించి ప్రొడక్టివిటీ అభివృద్ది చెందితే ఈ రంగం లో అవకాశాలు వెల్లువలా వస్తాయి.
6. FMCG ( Fast moving consumer goods )
ప్రస్తుత పరిస్థితి: ఇండియా లో FMCG పరిశ్రమ వచ్చే సంవత్సరానికల్లా 6.7% వృద్ది రేటును సాధించనుంది. 2015 లో కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ నుండి ఆదాయం $ 9.7 బిలియన్ లుగా ఉంటే 2016 లో ఇది $12.5 బిలియన్ లకు పెరిగిందని ఒక అంచనా.హై పెర్ఫార్మింగ్ ను కొనసాగించడం లో చిన్న చిన్న సమస్య లు ఉన్నప్పటికీ ఈ రంగానికి వచ్చిన ధోకా ఏదీ లేదు.
ఉద్యోగకల్పన: గత కొన్ని సంవత్సరాల నుండీ ఆదిత్య బిర్లా గ్రూప్, స్పెన్సర్స్ మరియు రిలయన్స్ లాంటి బ్రాండ్ లు తమ కు లాభాలు రాని స్టోర్ లను మూసివేయడం తో ఈ వ్యాపారాలు ఈ సంవత్సరం ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డట్లు అనిపించాయి. కాబట్టి ఉద్యోగాలు ఆశించిన స్థాయి లో ఉండక పోవచ్చు. కానీ చిన్న మధ్య తరహా నగరాలలో సేల్స్ టీమ్ లనేవి స్థిరంగా కొనసాగవచ్చు. కానీ టాప్ సిటి లలో మాత్రం ఈ రంగం లో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ లకు మరియు ఫుడ్ సర్వీస్ స్పెషలిస్ట్ లకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ కల్పన అనేది పెట్టుబడులు, సీజన్ లు తదితర విషయాలపై ఆధారపడి ఉండవచ్చు. ఈ పరిస్థితులు ఏప్రిల్ వరకూ కొనసాగవచ్చు.
ఉన్నతాధికారుల మాట: ఉద్యోగ కల్పన అనే ప్రక్రియ కొనసాగుతుంది. FMCG కంపెనీలు క్యాంపస్ సెలక్షన్ ల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నాయి. స్టార్ట్ అప్ రంగం లో నెలకొని ఉన్న అనిశ్చితి కారణంగా సేల్స్ మరియు మార్కెటింగ్ రంగం లో యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే అవకాశం ఉంది.
7. ఇన్ఫ్రాస్ట్రక్చర్
ప్రస్తుత పరిస్థితి: ఈ మధ్యనే లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ కంపెనీ తమ వర్క్ స్పేస్ నుండి 14,00 ల మంది ఉద్యోగులను తొలగించడం తో ఈ రంగం లో ఒక్కసారిగా కుదుపువచ్చినట్లయింది. డీ మానిటైజేషన్ వలన కాపిటల్ ఎక్స్ పెండిచర్ మరియు నగదు ప్రవాహం అనేవి తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యం లో ఈ రంగం పై ఇది దుష్ప్రభావాలను చూపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కాస్ట్ లు మరియు లేబర్ ను తగ్గించడం లాంటి చర్యలను చేయడం లాంటివి చూస్తుంటే ఈ రంగం ప్రత్యేకించి అన్ రెగ్యులర్ వర్క్ స్పేస్ లో మరింత క్షీణించే అవకాశం ఉంది.
ఉద్యోగ కల్పన: ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ రంగo లో కంపెనీలు ఉద్యోగ నియామకాలను చేపట్టే అవకాశం ఉంది. ఇందులో ఉద్యోగ వృద్ది రేటు 1% గా ఉన్నది. వినియోగదారుని నమ్మకం మరియు అమ్మకం దారుని సెంటిమెంట్ లాంటి అంశాలు పాజిటివ్ ఇంపాక్ట్ ను చూపించే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల మాట: ఈ రంగం లో నైపుణ్యం లేని లేబరర్ లంకు నైపుణ్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. లేకపోతే ఈ రంగం లో అనేక ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉంది. స్కిల్ ఇండియా లాంటి ఇనిషియేటివ్ లు కంపెనీలు తమ వర్కర్ లకు నైపుణ్యాల కల్పన లో సహాయపడగలవు.
8. BFSI ( బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ )
ప్రస్తుత పరిస్థితి: వృద్ది రేటు కి సంబంధించి ఫైనాన్సు రంగం మిశ్రమ ఫలితాలను అనుభవిస్తుంది. డీ మానిటైజేషన్ ను ప్రకటించిన తర్వాత ఈ రంగం ఒక్కసారిగా నిస్సత్తువ గా మారిపోయింది. బ్యాంకింగ్ రంగం కొంచెం నిదానంగా ఉన్నది కానీ NBFC ( నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీలు ) మాత్రం రానున్న కొద్ది నెలల్లో పుంజుకునే అవకాశం ఉంది.
ఉద్యోగ కల్పన: దాదాపు అన్ని బ్యాంకు లూ డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ రీసెర్చ్ టీమ్ లను తయారుచేసుకోవడానికి ప్రణాళిక లు సిద్దం చేసుకుంటున్న నేపథ్యం లో ఆయా ఏరియా లలో నియామకాల వేగం పెరగవచ్చు. MNC బ్యాంకు లకు సంబంధించి కొన్ని కొన్ని ఉద్యోగాలలో కోత ఉండవచ్చు. పే మెంట్ బ్యాంకు లు ఊహించని రీతిలో వృద్ది చెందవచ్చు. ఈ వాలెట్ మరియు ఫైన్ టెక్ లు 5 రెట్లు వృద్ది ని చూసే అవకాశం ఉంది. తదనుగుణంగా నియామకాలు కూడా ఉండవచ్చు.
ఉన్నతాధికారుల మాట: ఆన్ లైన్ లో అప్పు ఇవ్వడం, ఫైన్ టెక్ లనేవి ఇప్పుడిప్పుడే ఈ రంగం లోనికి అడుగుపెడుతున్నాయి. ఈ రంగం లో ఊహించని మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాంప్రదాయ బిజినెస్ లైన్ లకు బదులుగా డిజిటల్ గా వీటి విస్తృతి మరింత వేగం గా పెరిగే అవకాశం ఉంది.