వ‌ర్క్ ఫ్రం హోం.. క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక కూడా కొన‌సాగుతుందా? 

దేశంలో కరోనా వైరస్ అంత‌కంతకూ ప్ర‌బలుతోంది. దాదాపు 40 రోజులుగా దేశ‌మంతా లాక్‌డౌన్ పెట్టి క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటున్నా కేసులు వ‌స్తూను ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా ఎంఎన్‌సీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగుల‌తో వ‌ర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. చాలాచోట్ల మీడియా సంస్థ‌లు కూడా వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు చేస్తున్నాయి. ఉద్యోగులు క‌రోనా బారిన‌ప‌డ‌కుండా కాపాడుకుంటూనే ప్రొడ‌క్టివిటీ దెబ్బ‌తిన‌కుండా ప‌ని చేయ‌డానికి వ‌ర్క్ ఫ్రం హోమ్ ఉప‌యోగ‌పడుతుంది. అయితే ఈ వ‌ర్క్ ఫ్రం హోం ఎన్నాళ్లు ఉంటుంద‌నేదానిపై ఇప్పుడు ఎవ‌రికీ క్లారిటీ లేదు. కొన్ని సంస్థ‌లు సొంతంగా ఫ‌లానా తేదీ వ‌ర‌కు మీరు వ‌ర్క్ ఫ్రం  హోం చేయాల్సి ఉంటుంద‌ని ఎంప్లాయిస్‌కు చెబుతున్నాయి. కొన్నిచోట్ల అధికారులే ఆయా సంస్థ‌ల య‌జ‌మానుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఎప్ప‌టివ‌ర‌కు ఉండాల‌నేదానిపై ఆదేశాలిస్తున్నారు.  

గురుగ్రామ్‌లో జులై నెలాఖ‌రువ‌ర‌కు
జులై నెలాఖరు వరకు ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోం కొన‌సాగించేలా చూడాలని గురుగ్రామ్ నగరానికి చెందిన పలు ఎంఎన్‌సీ కంపెనీలను హర్యానా గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశించింది. గురుగ్రామ్‌లో ఎంఎన్‌సీలు, బీపీవోలు, ఐటీ సంస్థలు జులై 31 వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించాలని కోరామ‌ని గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈవో వీఎస్ కుందూ చెప్పారు. దేశ రాజధాని నగర సమీపంలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లో భాగమైన గురుగ్రామ్‌ను మిలీనియం సిటీ అంటారు. ఇక్క‌లో ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా అనేక బ‌డా ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బీపీఓలు,ఎంఎన్‌సీలున్నాయి.  కరోనా నేపథ్యంలో మార్చి నుంచే ఈ కంపెనీల ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోం చేయించాల‌ని స్థానిక అధికారులు ఆదేశించారు. గురుగ్రామ్‌లో ఇప్ప‌టికే 51 క‌రోనా పాజిటివ్ కేసులు రావ‌డంతో ప‌రిస్థితి ఇంకా  అదుపులోకి రాలేదు. దీంతో జులై నెలాఖరు వరకు అన్ని కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినట్లు కుందూ వివరించారు.  

టీసీఎస్‌లో ఏడాది చివ‌రి వ‌ర‌కు!
ఐటీ దిగ్గ‌జ కంపెనీల్లో ఒక‌టైన టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ (టీసీఎస్‌) ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం చేయాల్సి ఉంటుంద‌ని ఎంప్లాయిస్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.  హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లోని ఐటీకంపెనీల్లో ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. వీరంద‌రూ ఎన్నాళ్ల‌పాటు వ‌ర్క్ ఫ్రం హోం చేయాల్సి ఉంటుందో ప్ర‌స్తుతానికి అర్థం కాని ప‌రిస్థితి.  లాక్‌డౌన్ పొడిగింపు, ఆయా ప్రాంతాల్లో కేసులు లేక‌పోవ‌డం వంటి వాటిని బ‌ట్టి దీనిపై అధికారులు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. 

ఎక్కువ‌మందిని వ‌ర్క్ ఫ్రం హోం చేయిద్దాం
లాక్డౌన్ ముగిసి సాధార‌ణ ప‌రిస్థితులు వ‌చ్చినా క‌నీసం 50 నుంచి 75 శాతం మంది ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేయించాల‌ని టీసీఎస్‌లాంటి కొన్ని సంస్థ‌లు ఆలోచిస్తున్నాయ‌ట‌. టార్గెట్ బేస్డ్ వ‌ర్క్ కావ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు టీమ్ లీడ్స్ త‌మ టీమ్ మెంబ‌ర్ల‌తో 
వీడియో కాన్ఫ‌రెన్స్‌లు పెట్టుకుని టార్గెట్లు పూర్తి చేయిస్తుండ‌డంతోవ‌ర్క్ ఫ్రం హోంను క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక కూడా కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంద‌ని కంపెనీలు ఆలోచిస్తున్నాయి.  దీనివల్ల ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేష‌న్‌, ఆఫీస్‌లో క‌రెంట్‌, నెట్ వాడ‌కం త‌గ్గుతాయని.. ఈ క‌ష్ట‌కాలంలో ఇలా ఎంత ఆదా అయితే అంత ఆదా చేసుకుందామ‌న్న‌ది కంపెనీల భావ‌న‌గా క‌నిపిస్తోంది. చూద్దాం ఈ వ‌ర్క్ ఫ్రం
హోం ఇంకెన్నాళ్లుంటుందో..

 

Work from home wfh it employees work from home corona lock down వ‌ర్క్ ఫ్రం హోం ఐటీ ఉద్యోగుల వ‌ర్క్ ఫ్రం హోం గురుగ్రామ్‌లో జులై 31 వ‌ర‌కు వర్క్ ఫ్రం హోం