• తాజా వార్తలు

అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న Amazon ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. యూజర్లకు నాణ్యమైన సేవలను , ఫాస్ట్ డెలివరీ అందించాలనే లక్ష్యంతో amazon india flex సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్ట్ టైం ఉద్యోగాలకు ఆహ్వానం పలుకుతోంది.  అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు. అమెజాన్ ఫ్లెక్స్‌లో కాలేజ్ విద్యార్థులు, ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, సర్వీస్ సెక్టార్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ వంటి వారు ప్రొడక్టులను డెలివరీ చేసి డబ్బు సంపాదించొచ్చు. 

అమెజాన్ గ్లోబల్‌గా 2015లోనే ఈ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఆరు దేశాల్లో ఈ రకమైన సేవలను అందిస్తోంది. తాజాగా ఇప్పుడు భారత్‌లోనూ ఈ సర్వీసులను లాంచ్ చేసింది. దీంతో కంపెనీ డెలివరీ నెట్‌వర్క్ మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశముంది. కంపెనీ తొలిగా ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అమెజాన్ ఫ్లెక్స్ సేవలు ప్రారంభించింది. తర్వాత క్రమంగా ఇతర నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించనుంది. మీరు కూడా పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంటే అమెజాన్ ఫ్లెక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. డెలివరీ డబ్బులను వారం వారం కంపెనీ డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో వేసేస్తుంది.

ఈ పోగ్రాం ద్వారా వీలైనంతమంది ఎక్కువ కస్టమర్లను ఆకర్షించాలనే లక్ష్యంగా పనిచేస్తొంది. అలాగే డెలివరీ ప్రాసెస్ ని అత్యంత వేగవంతం చేయనుంది. ఈ రెండు సర్వీసులే టార్గెట్ గా  amazon india flex సర్వీసులను ప్రారంభించింది. 

ఎవరు అర్హులు
18 సంవత్సరాలు నిండి ఉండాలి.
2జిబి ర్యామ్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. అది ఆండ్రాయిడ్ వర్షన్ 6.0ని సపోర్ట్ చేయగలిగి ఉండాలి. 
ఆ ఫోన్ ఫ్లాష్ తో కూడిన కెమెరాతో పాటు జీపీఎస్ కలిగి ఉండాలి. సిమ్ వాయిస్ డేటా కనెక్టివిటీ కలిగి ఉండాలి. 
అన్ని రకాల అర్హతలు కలిగిన టూ వీలర్  కలిగి ఉండాలి. సర్టిఫ్ కేట్లు అన్ని ఉండాలి
జాబు చేయాలనుకునే వారు డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలి. 
పాన్ కార్డు కలిగి ఉండాలి
సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ కలిగి ఉండాలి. 

లోకల్ ఏరియాలో ఉన్నవారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి బుధవారం పేమెంట్ బ్యాంకు ట్రాన్సఫర్ ద్వారా చెల్లించబడుతుంది. పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నవారు డెలివరీ సమయంలో ఏదైనా జరిగితే కంపెనీ రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో తెలిపింది. మరిన్ని వివరాలకు అమెజాన్ యాప్ ని సందర్శించగలరు. 

జన రంజకమైన వార్తలు