• తాజా వార్తలు

2018 లో ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టే ఐటి స్కిల్స్ ఏవి ?

ఐ టి ఇండస్ట్రీ లో ఉద్యోగాలు చేసేవారికి మరింత ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టే స్కిల్స్ గురించి ప్రముఖ రీసెర్చ్ సంస్థ జిన్నోవా ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఐటి ఇండస్ట్రీ లో ఉద్యోగ కల్పన 2017 లో 17 శాతం పెరిగింది. ఇంజినీరింగ్ మరియు R&D విభాగంలో బహుళజాతి కంపెనీలు ఎక్కువ జీతాలనూ, ఎక్కువ ఇంక్రిమెంట్ లనూ అందిస్తున్నాయి. క్లౌడ్, అనలిటిక్స్,మెషిన్ లెర్నింగ్,ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, ఇంటర్ నెట్ అఫ్ థింగ్స్,రోబోటిక్స్ తదితర నైపుణ్యాలు కలిగిన వారికి ఎక్కువ శాలరీ సంపాదించే అవకాశం ఉంది. ఇవి కాక ఇంకా ఎటువంటి స్కిల్స్ ఉంటే ఐటి ఇజ్డుస్త్రి లో ఎక్కువ శాలరీ వస్తుంది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

రోబోటిక్స్

ఈ విభాగంలో రోబోటిక్స్ టాప్ పొజిషన్ లో ఉంది.రోబోటిక్స్ స్కిల్స్ ఉన్న ఐటి ప్రొఫెషనల్స్ కు ఈ సంవత్సరం సగటు శాలరీ పెరుగుదల ఎక్కువగా ఉన్నది.2016 లో ఇది 16 స్సాటం ఉండగా 2017 కు 18 శాతానికి పెరిగింది.

UI/UX

శాలరీ ఎక్కువ తెచ్చిపెట్టే అంశంలో UI/UX రెండవ స్థానం లో ఉంది. ఈ సంవత్సరం ఈ స్కిల్ ఉన్నవారి శాలరీ లో సగటు పెరుగుదల 16.5 శాతంగా ఉండనుంది. గత సంవత్సరం కూడా ఇది ఇలాగే ఉండడం గమనార్హం.

మెషీన్ లెర్నింగ్

మూడవస్థానం లో ఉన్న మెషిన్ లెర్నింగ్ విభాగం లో స్కిల్స్ కలిగి ఉన్నవారికి తమ శాలరీ లో 17 శాతం పెరగనుంది. గత సంవత్సరం ఈ పెరుగుదల 16 శాతంగా ఉన్నది.

అనలిటిక్స్

తర్వాతి స్థానం అనలిటిక్స్ ది. అనలిటిక్స్ ప్రొఫెషనల్స్ లకు తమ శాలరీ లో 16 శాతం పెరుగుదల ఉండనుంది.గత సంవత్సరం ఈ పెరుగుదల 15 శాతం గా ఉన్నది.

బిగ్ డేటా

జినోవా రిసెర్చ్ ప్రకారం బిగ్ డేటా స్కిల్స్ కలిగి ఉన్న ప్రొఫెషనల్స్ తమ శాలరీ లో 15 శాతం పెరుగుదల ను ఆశించవచ్చు.గత సంవత్సరం ఇది 14 శాతం గా ఉన్నది.

మొబైల్ టెక్నాలజీస్

ఇక ఈ జాబితాలో చివరి స్థానం మొబైల్ టెక్నాలజీ ది. గత సంవత్సరం ఈ అంశం లో యావరేజ్ శాలరీ పెరుగుదల 13 శాతం ఉండగా ఈ సంవత్సరం 14 శాతంగా ఉండనుంది.

జన రంజకమైన వార్తలు