• తాజా వార్తలు

ఫైల్స్ అప్‌లోడ్ చేసి డ‌బ్బులు సంపాదించుకోవ‌డానికి ఫైల్ ఫేర్‌!

ఆన్‌లైన్ డ‌బ్బులు సంపాదించ‌డానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. గూగుల్ యాడ్స్ ద్వారానే ఎక్కువ‌మంది డ‌బ్బులు సంపాదిస్తుంటారు. అయితే ఇది ఒక మార్గం మాత్ర‌మే.. మ‌న‌కు తెలియ‌ని ఎన్నో మార్గాలు ఇంకా ఉన్నాయి. ఆ కోవ‌కు చెందిందే ఫైల్ ఫేర్‌. ఏంటి ఈ ఫైల్ ఫేర్ ప్ర‌త్యేక‌త అంటారా? ఈ సైట్లోకి వెళ్లి ఫైల్స్ అప్‌లోడ్ చేస్తే చాలు మీకు డ‌బ్బులు సంపాదించొచ్చు? అదెలా సాధ్య‌మో చూద్దాం. 

ఏమిటీ ఫైల్‌ఫేర్‌?
జ‌స్ట్ ఫైల్స్ అప్‌లోడ్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు మ‌న ఖాతాలో వేసే సైట్ ఇది. అయితే దీనికి కొంత ప్రాసెస్ ఉంది. మీరు ఈ సైట్లోకి వెళ్లి మీ డిటైల్స్‌తో రిజిస్ట‌ర్ చేసుకుంటే  మీకు కొన్ని అప్‌లోడ్ చేసే ఫైల్స్ లింక్స్ పంపుతారు. లేదా మీకు సంబంధించిన కొన్ని ఫైల్స్ అయినా అప్‌లోడ్ చేయ‌చ్చు. వాటిని మీరు అవ‌స‌ర‌మైన వారికి షేర్ చేయాలి. అంటే ఆ ఫైల్స్ అవ‌స‌రం ఉన్న కేట‌గిరి పీపుల్ ఆ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు.  అలా ఎన్ని ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు అంత‌గా మ‌నీ వ‌స్తుంది. అలా వ‌చ్చిన మ‌నీలో 6  శాతం మాత్ర‌మే  ఫైల్‌ఫేర్ క‌ట్ చేసుకుని మిగిలిన అమౌంట్ మీ ఖాతాలో వేస్తుంది.    

ఫ్రెండ్స్‌కు రిఫ‌ర్ చేస్తే..
ఈ ఫైల్ ఫేర్ ద్వారా మీరు రెండు ర‌కాలుగా డ‌బ్బులు సంపాదించొచ్చు. ఒక‌టి ఫైల్స్ అప్‌లోడ్ చేయ‌డం ద్వారా రెండు మీ స్పేహితుల‌కు రిఫ‌ర్ చేయ‌డం ద్వారా.. మీరు రిఫ‌ర్ చేసిన వాళ్లు ఈ సైట్లో రిజ‌స్ట‌ర్ అయితే మీకు 1 శాతం క‌మిష‌న్ లభిస్తుంది.  మీరు ఫైల్‌ఫేర్‌లో రిజిస్ట‌ర్ కావాలంటే ముందుగా ఫేస్‌బుక్‌, ట్విట‌ర్, గూగుల్ లేదా ఈమెయిల్ ఐడీల ద్వారా సైన్ అప్ కావాలి.  ఒక‌సారి ఎంట‌ర్ అయిన త‌ర్వాత మీ మెయిల్ ఐడీకి పంపిన లింక్స్‌ను అప్‌లోడ్ చేస్తూ పోవాలి. లేదా మీకు సంబంధించిన ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయాలి. అవి ఎంత‌గా అమ్ముడుపోతే అంత మీకు లాభం. ఫైల్ సైజు 100 ఎంబీ సైజుకు మించ‌కుండా ఉండాలి. అప్‌లోడ్ చేశాక ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిలో  ఆ ఫైల్‌కు సంబంధించిన డిటైల్స్ ఎంటర్ చేయాలి.  ఆ పై ఇమేజ్‌, ఆడియా కూడా యాడ్ చేయ‌చ్చు.                                                                                                                                  

జన రంజకమైన వార్తలు