• తాజా వార్తలు

ఫొటోల‌ను ఎడిట్ చేసి డ‌బ్బులు సంపాదించుకోవ‌డానికి ఓ యాప్ 

మీకు ఫొటోషాప్‌లో స్కిల్ ఉందా? అయితే దాన్ని ఉప‌యోగించి ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు... మీరు ఇష్ట‌ప‌డి తీసుకున్న‌ ఫొటోను మీకు కావాల్సిన‌ట్లు ప్రొఫెష‌న‌ల్స్‌తో ఎడిట్ చేయించుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇలాంటి అవ‌స‌రాల‌న్నింటికీ తీర్చ‌డానికి ఓ యాప్ ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో దొరికే ఈ యాప్ పేరు మెండ‌ర్ (Mendr). దీనిలో ఫొటో ఎడిటింగ్ కావాల‌నుకుంటే చేయొచ్చు. ఫొటో ఎడిట‌ర్లు వాటిని ఎడిట్ చేసి డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు.  ఒక‌రకంగా చెప్పాంలంటే మెండ‌ర్ ఒక మైక్రో జాబ్ యాప్ అన్న‌మాట‌. 
 మెండ‌ర్‌లో రెండు ర‌కాల యూజ‌ర్లు ఉంటాయి. ఒక‌రు మాసెస్ (ఫొటో ఎడిట్ చేయించుకోవాల‌నుకునేవారు), ఎడిట‌ర్స్ (ఫోటోలు ఎడిట్ చేయ‌గ‌ల‌వారు). 

మాసెస్ ఏం చేయాలంటే.. 
మీరు మీ ఫొటోను అప్‌లోడ్ చేసి ఎడిట్ చేయాల‌ని చెప్ప‌గానే మెండ‌ర్ మీకు ఓ ఫొటో ఎడిట‌ర్‌ను మ్యాచ్ చేస్తుంది. 
* ఆ ప‌ర్స‌న్ మీ ఫొటోను మీరు కోరుకున్న‌ట్లు ఎడిట్ చేస్తారు.  ఎలా ఎడిట్ చేయాలో మీరు అక్క‌డున్న ఆప్ష‌న్ల  ద్వారా గానీ లేదా మీ సొంత ఐడియా గానీ చెప్పొచ్చు. 
* ఎడిట్ అయిన ఫొటో కూడా యాప్ ద్వారా తిరిగి మీకు వ‌స్తుంది. 
* ఫొటో ఎడిటింగ్‌కు  కొంత ఛార్జి చేస్తారు. ఆ అమౌంట్‌లో మెండ‌ర్ కొంత తీసుకుని మిగిలింది ఫొటో ఎడిట‌ర్‌కు ఇస్తుంది.  
* ఈ పేమెంట్ ప్రాసెస్ అంతా పేపాల్ ద్వారానే జ‌రుగుతుంది. 

ఎడిట‌ర్ ఏం చేయాలంటే..
* ఫొటో ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తామ‌ని అప్ల‌యి చేసుకోవాలి.  
*  సెలెక్ట్ చేసే ముందు మెండ‌ర్ ఓ చిన్న టెస్ట్ పెడుతుది. దానిలో వ‌చ్చిన రిజ‌ల్ట్‌ను బ‌ట్టి beginner, intermediate,  advanced అనే మూడు కేట‌గిరీల్లో ఏదో ఒక‌దానిలో సెలెక్ట్ చేస్తుంది.
* టెస్ట్‌లో ఫెయిల‌యితే రెండు వారాల త‌ర్వాత అప్ల‌యి చేసుకోవ‌చ్చు.  
* మీకు ఫొటోషాప్‌లో స్కిల్స్ ఉంటే మీరు సెలెక్ట్ కావ‌డం ఈజీ.  
* మెండ‌ర్ అద్భుత‌మైన మైక్రోజాబ్ సైట్‌.  ఫొటో ఎడిట‌ర్ ఒక్కో జాబ్‌కు వ‌ర్క్‌, పెర్‌ఫార్మెన్స్‌ను బ‌ట్టి 2 డాల‌ర్లు (130 రూపాయ‌ల ) నుంచి 30 డాల‌ర్లు (దాదాపు 2వేల‌) వ‌ర‌కు పొందే అవకాశం ఉంద‌ని ఓ అంచ‌నా.  

జన రంజకమైన వార్తలు