• తాజా వార్తలు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ గ్రోత్ ఉన్న టెక్ జాబ్స్ ఏవి?- లింక్డ్ ఇన్ సర్వే

భారతదేశంలో సాంకేతిక రంగంలోనే ఉద్యోగ వృద్ధి వేగంగా జరుగుతున్నదని లింక్డ్ ఇన్ సర్వే తేల్చింది. ఆ మేర‌కు ప్ర‌తి 10 కొత్త ఉద్యోగాల‌లో 8 సాంకేతిక రంగంలోనివేన‌ని పేర్కొంది. ఇప్పుడు లింక్డ్ ఇన్‌లో 5 కోట్ల ప్రొఫైళ్లున్నాయి. ఇందులోని స‌భ్యులు త‌ర‌చూ త‌మ ప్ర‌స్తుత నైపుణ్యాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌టంద్వారా  ఉద్యోగాలు పొందుతూ ముందుకెళ్తున్నారు. ఇక 2013 నుంచి 2017 మ‌ధ్య స‌భ్యులు త‌మ ప్రొఫైళ్ల‌లో వాడే కీల‌క‌ సంకేత ప‌దాల‌ను లింక్డ్ ఇన్ విశ్లేషించి, వారికి త‌గిన ఉద్యోగ‌మేదో పోల్చిచూస్తూ వ‌స్తోంది. ఇలా విశ్లేషించిన 10 అగ్ర‌శ్రేణి  ఉద్యోగాల‌కుగాను తొలి ఐదు స్థానాల్లో సాంకేతిక ప‌రిజ్ఞాన రంగానిదే పైచేయి. మొత్తంమీద 8 ఆ రంగంలోనివే అయిన‌ప్ప‌టికీప్ర‌స్తుత ధోర‌ణుల దృష్ట్యా ప్ర‌ధాన ప‌రివ‌ర్త‌నాత్మ‌క మార్పులు చోటుచేసుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఉద్యోగ వృద్ధి ఏ సాంకేతిక రంగంలో అత్య‌ధికంగా ఉంది?

   ఇది ఏ ఒక్క రంగానికో ప‌రిమితం కాదుగానీ.. ఈ విష‌యంలో ‘‘బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్‌’’ల‌దే అగ్ర‌స్థాన‌మ‌ని చెప్పాలి. ఈ మేర‌కు సాంకేతిక‌ పరిజ్ఞాన రంగంలోని ఐదు అగ్ర‌శ్రేణి ఉద్యోగాలు... 1. మెషీన్ లెర్నింగ్ ఇంజ‌నీర్ 2. అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎన‌లిస్ట్ 3. బ్యాక్ ఎండ్ డెవ‌ల‌ప‌ర్ 4. ఫుల్ స్ట్యాక్ ఇంజ‌నీర్ 5. డేటా సైంటిస్ట్- ఈ ఐదింటిలో వ‌రుస‌గా 43, 32, 23, 18, 14 రెట్లదాకా వృద్ధి న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

సాంకేతిక రంగంలో ఈ మార్పు ఎక్క‌డ సంభ‌విస్తోంది?

   ఇటీవ‌లి 8-10 సంవ‌త్స‌రాల న‌డుమ‌ సాంకేతిక రంగంలో అత్యంత అభిల‌ష‌ణీయ ఉద్యోగాలంటే... ‘‘సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌, బిజినెస్ ఎన‌లిస్ట్‌.’’ అగ్ర‌స్థానంలో ఉండేవి. అయితే, నేడు ‘‘బిగ్ డేటా ఎనాలిసిస్‌, మెషీన్ లెర్నింగ్’’ వేగంగా దూసుకెళ్తుండ‌ట‌మే కాదు... వీటికిగ‌ల గిరాకీతో పోలిస్తే ఉద్యోగాల సంఖ్య‌క‌న్నా నిపుణుల ల‌భ్య‌త చాలా త‌క్కువ‌గా ఉంది. అంటే... సాధార‌ణ సాంకేతిక ఉద్యోగాలతో పోలిస్తే ఇలాంటి ప్ర‌త్యేక నైపుణ్యం అవ‌స‌ర‌మైన ఉద్యోగాల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని లింక్డ్ ఇన్ స‌ర్వే తేల్చింది.

డిమాండ్ ఉన్న ఇత‌ర ఉద్యోగాలేమిటి?

   అగ్ర‌స్థానంలోని 10 ఉద్యోగాల‌లో తొలి ఐదు పోగా- ‘‘క‌స్ట‌మ‌ర్ స‌క్సెస్ మేనేజ‌ర్‌, డిజిట‌ల్ మార్కెటింగ్ స్పెష‌లిస్ట్‌, బిగ్ డేటా డెవ‌ల‌ప‌ర్‌, సేల్స్ రిక్రూట‌ర్, పైథాన్ డెవ‌ల‌ప‌ర్ పోస్టులు త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటిలో క‌స్ట‌మ‌ర్ స‌క్సెస్ మేనేజ‌ర్’- త‌మ సంస్థ వాడే సాఫ్ట్‌వేర్‌తో ప‌నిచేసుకునేలా క్ల‌యింట్ల‌కు స‌హాయ‌ప‌డుతూ, వార్షిక కాంట్రాక్టుల రెన్యువ‌ల్‌కు తోడ్ప‌డతారు. అలాగే ఈ-కామ‌ర్స్‌, డిజిట‌ల్ కంపెనీలు త‌మ‌వంతు ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో డిజిట‌ల్ మార్కెటింగ్ స్పెష‌లిస్ట్‌ఉద్యోగం కూడా అత్యంత అభిల‌ష‌ణీయ‌మైన‌దిగా ప‌రిగ‌ణ‌న‌లో ఉంది. ఇక ఆఖ‌రుగా చెబుతున్న‌ప్ప‌టికీ... సేల్స్‌నైపుణ్యాధారిత ఉద్యోగం ఏ కాలంలోనైనా నిత్య ప్రాధాన్యంగ‌లిగిన‌దే!

   బిగ్ డేటా గురించి ప్ర‌స్తావిస్తే... ఢిల్లీ, ముంబై న‌గ‌రాల‌నుంచే తీవ్ర‌మైన పోటీ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సింగ‌పూర్‌కు డేటా సైంటిస్టుల‌ను, సైబ‌ర్ భ‌ద్ర‌త నిపుణుల‌ను అత్య‌ధికంగా అందిస్తున్నది భార‌త‌దేశ‌మేన‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. ప్ర‌స్తుతం సింగ‌పూర్‌లోని ఈ రెండు రంగాల నిపుణుల‌లో 22 శాతం భార‌త్‌నుంచి వ‌చ్చిన‌వారేన‌ని స‌ర్వే ప్ర‌క‌టించ‌డం విశేషం.

జన రంజకమైన వార్తలు