• తాజా వార్తలు

ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

ఒక బిజినెస్ మొద‌లుపెట్టాలంటే కేవ‌లం ఐడియాలు ఉంటే స‌రిపోవు. వాటిని స‌క్ర‌మంగా అమ‌ల్లోకి తీసుకొచ్చి కార్య‌రూపం దాల్చేలా చేయ‌డం కీల‌కం. కొత్త‌గా ఒక బిజినెస్ మొద‌లుపెట్టే వారికి త‌మ‌కు కావాల్సిన రిసోర్సులు ఏమిటో తెలియ‌దు. ఇవి ఉంటే మీ వ్యాపారం ప్రారంభించ‌డ‌మే కాదు ఆ వ్యాపారాన్నినిరాంట‌కంగా కొన‌సాగించే వీలుంటుంది. మ‌రి స్టార్ట‌ప్ కోసం కావాల్సిన రిసోర్సులు ఏంటో తెలుసుకుందామా!

ఫౌండ‌ర్స్‌ కిట్‌
మీరు ఒక సంస్థ‌ను ప్రారంభించే ముందు మీ మ‌నీ, స‌మ‌యం వృథా కాకుండా ఉండాలంటే ఫౌండ‌ర్ కిట్ ఉండాలి. అంటే మీ సంస్థ గురించి అనుభ‌వం క‌లిగిన ఫౌండ‌ర్ల నుంచి ఎలాంటి ప‌క్ష‌పాతం లేని రివ్యూలు కావాలి. దీని వ‌ల్ల మ‌న స్టార్ట‌ప్‌లో ఉన్న లోపాలేంటి...దీనిలో ఉన్న ఉప‌యోగాలు ఏంటి? స‌రిచేసుకోవాల్సిన‌వి ఏమిటో మ‌న‌కు తెలుస్తాయి.

ఇన్వెస్ట‌ర్ లిస్ట్‌
మీ బిజినెస్ కోసం మీకు ఎక్క‌డ మ‌నీ కావాలో తేల్చుకోలేక‌పోతున్నారా. అయితే ఇన్వెస్ట‌ర్ కిట్ మీకు బాగాఉప‌యోగ‌ప‌డుతుంది. అంటే ఇందులో 1000 మంది ఇన్వెస్ట‌ర్లు ఉంటారు. మీకు కావాల్సిన వారికి సెర్చ్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. అంటే స్టార్ట‌ప్‌ను మొద‌లుపెట్టే ముందు ఎవ‌రు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌నీ ఎడ్జెస్ట్‌మెంట్ ఎలా చేసుకున్నార‌నే విష‌యాలు కూడా ఉంటాయి.

గెట్ సిర‌ప్‌
అంకుర సంస్థ స్థాప‌న‌కు మ‌నం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. మ‌నీ మాత్ర‌మే కాదు ఆరంభంలో ఎన్నో ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. ఎంత చిన్న బిజినెస్ అయినా ప్ర‌తి రూపాయీ లెక్కే. అంతేకాదు స‌మ‌యం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి ఇబ్బందుల‌ను బ‌య‌ట‌ప‌డేసేందుకు గెట్ సిర‌ప్‌ను త‌యారు చేశారు. అంటే స్టార్ట‌ప్‌ల కోసం డిసౌంట్ల‌ను ఇచ్చే సంస్థ‌లను, ప్రొడెక్ట‌ల వివ‌రాల‌ను గెట్ సిర‌ప్ ఉంచారు. ఇది అంద‌రికి ఉచితం.

మార్కెటింగ్ స్టాక్‌
అయితే చాలామంది కొత్త‌గా సంస్థ‌ల‌ను ప్రారంభించేవాళ్లు అన్ని ప‌నులు తామే చేసుకోవాల‌ని భావిస్తారు. అంటే ప్రొడెక్ట‌విటీతో పాటు డ‌బ్బును ఆదా చేయాల‌నేది వారి ప్ర‌య‌త్నం. అయితే మార్కెటింగ్ విష‌యంలో వారి వ్యూహాలు ప‌ని చేయ‌వు. ఇలాంటి వారి కోసం మార్కెటింగ్ స్టాక్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మార్కెటింగ్ రిసోర్సుల గురించి ఈ టూల్ పూర్తి స‌మాచారం అందిస్తుంది.

గుడ్ ఈమెయిల్ కాపీ
మీరు ఒక సంస్థ‌ను స్థాపిస్తే ప్ర‌తిరోజూ చాలా ఈమెయిల్స్ పంపాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క‌రికి ఒక్కోలా మ‌నం ఈమెయిల్స్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్ర‌త్యేకంగా కూర్చొంటే చాలాస‌మ‌యం వృథా.అందుకే ఈ ఈమెయిల్ కాపీ టూల్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనికోసం కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి.

లాంచ్‌పాడ్ ఫ‌ర్ స్కేచ్‌
మీ కంపెనీ పాపుల‌ర్ కావాలంటే మీకో వెబ్‌సైట్ ఉండాలి. దీని ద్వారానే మీ వ్యాపారం గురించి ప్ర‌పంచానికి తెలుస్తుంది. మీ ప్రొడక్ట్స్, మీ స‌ర్వీసుల గురించి తెలియ‌జేయ‌డానికి ఒక వెబ్‌సైట్ త‌యారు చేసుకోవాలి. అయితే అంద‌రికి వెబ్‌సైట్ల గురించి అవ‌గాహ‌న ఉండ‌దు అలాంటి వారి కోస‌మే లాంచ్‌పాడ్ ఫ‌ర్ స్కేచ్ టూల్ అవ‌సరం.
మిక్స్‌మాక్స్ క్యాలెండ‌ర్‌
వ్యాపార‌వేత్త‌గా ప్ర‌తి రోజూ ఎంత‌మంది క‌ల‌వాల్సి ఉంటుంది. దీని కోసం ఒక మంచి మీటింగ్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ఉండాలి. పెద్ద కంపెనీలు అయితే ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా మీరు మిక్స్ మాక్స్ క్యాలెండ‌ర్ ద్వారా మీ షెడ్యుల్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఈమెయిల్స్‌, వెబ్‌సైట్లు, సోష‌ల్ ప్రొఫైల్స్ అన్ని దీనికి యాడ్ చేసుకోవ‌చ్చు.

సోష‌ల్ మీడియా అకాడ‌మీ
ఈ ఇంట‌ర్నెట్ యుగంలో సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం చాలా కీల‌కం. అంతేకాదు ఖ‌ర్చు లేనిది కూడా. కొత్త‌గా కంపెనీ పెట్టిన వారు క‌చ్చితంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి. సోష‌ల్ మీడియా అకాడ‌మీ బై బ‌ఫ‌ర్ టూల్ మీకు మార్కెటింగ్ కోసం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

జన రంజకమైన వార్తలు