• తాజా వార్తలు

బీఎస్ఎన్ఎల్ తెలంగాణ స‌ర్కిల్‌లో మ‌రిన్ని వైఫై హాట్‌స్పాట్స్ 


బీఎస్ఎన్ఎల్ కొత్త‌గా తెలంగాణ స‌ర్కిల్‌లో కొత్త వైఫై హాట్‌స్పాట్‌ను లాంచ్ చేసింది. 2015లో బీఎస్ఎన్ఎల్ తొలిసారిగా హాట్‌స్పాట్స్‌ను ప్ర‌వేశ‌పెపెట్టింది. వార‌ణాసిలో మొద‌లుపెట్టి ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 49,517 హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ‌లో 1388 హాట్‌స్పాట్స్ పెట్టింది. ఇందులో 382 హాట్‌స్పాట్స్ హైద‌రాబాద్‌లో ఉన్నాయి.  

గ్రీన్‌గ్రేస్ గేటెడ్ క‌మ్యూనిటీలో హాట్‌స్పాట్‌
బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్‌గా సోమ‌వారం హైద‌రాబాద్‌లోని గ్రీన్‌గ్రేస్ గేటెడ్ క‌మ్యూనిటీలో హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసింది. 5.38 ఎక‌రాల వైశాల్యం ఉన్న ఈ గేటెడ్ క‌మ్యూనిటీలో 402 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.  

9 రూపాయ‌ల నుంచి వోచ‌ర్లు
ఈ అపార్ట్‌మెంట్లలోని వారంద‌రికీ వైఫై ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. 2జీబీపీఎస్ నుంచి 20 జీబీపీఎస్ వ‌ర‌కు స్పీడ్ వ‌స్తుంది.  దీంతోపాటు 9, 19, 39, 59, 69 రూపాయ‌ల వోచ‌ర్లు కూడా ప్ర‌వేశ‌పెట్టింది. వీటిని మామూలు డేటాగా వాడుకోవ‌చ్చు. 

* 9 రూపాయ‌ల వోచ‌ర్ వ్యాలిడిటీ ఒక రోజు. 1జీబీ డేటా  వ‌స్తుంది. 

* 19 రూపాయ‌ల వోచ‌ర్‌తో 3జీబీ డేటా, 3 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది. 

* 39 రూపాయ‌ల వోచ‌ర్‌తో 7జీబీ డేటా, 7 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది.

* 59 రూపాయ‌ల వోచ‌ర్‌తో 15జీబీ డేటా, 15 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది.

* 69 రూపాయ‌ల వోచ‌ర్‌తో 30 జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది.
  

 

జన రంజకమైన వార్తలు