• తాజా వార్తలు

ఇకపై హైదరాబాద్ ట్రాఫిక్ని రియల్ టైమ్ లో నడపనున్న గూగుల్ మ్యాప్స్

హైదరాబాద్ లో జనం బయటకు రావాలంటే భయమే. ఎందకంటే ట్రాఫిక్. ముఖ్యంగా ప్రిమియర్ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా ఉండవు. వర్షం పడితే ీఈ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే మాన్యువల్ గా కాక.. టెక్నాలజీ మీద ఆదారపడాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే రియల్ టైమ్ లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడుతున్నారు. మరి అదెలాగో చూద్దామా..


రియల్ టైమ్ లో 

మాములుగా ట్రాఫిక్ పోలీసులకు పెద్ద సవాల్ కీలక సమయాల్లో ట్రాఫిక్ ని నియంత్రించడం. ఇందుకోసం కంట్రోల్ రూమ్ ద్వారా ట్రాఫిక్ ని పరిశీలిస్తూ అవసరమైన చోటు దారి మళ్లిస్తూ నియంత్రిస్తూ ఉంటారు. అయితే ఎక్కడకక్కడ కెమెరాలు, కంట్రోల్ రూమ్ లు ఉన్నా ట్రాఫిక్ నియంత్రణ మాత్రం సాధ్యం కావట్లేదు. ఈ నేపథ్యంలో రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో బెంగళూరు మాత్రమే ఇలా రియల్ టైమ్ లో ట్రాఫిక్ డేటా  ద్వారా నియంత్రణ చేస్తోంది. ఇప్పుడు ఐటీ హబ్ హైదరాబాద్ కూడా అదే బాటలో నడుస్తోంది.

ఎలా నియంత్రిస్తారు?

ట్రాఫిక్ బాగా ఉండే ప్రాంతాల్లో డేటాను గూగుల్ మ్యాప్స్ ద్వారా తీసుకుని  దాని ద్వారా పోలీసులు పని చేస్తారు. అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు సిగ్నల్స్ వేయడం.. లేదా మళ్లించడం లాంటివి చేస్తారు. సాధారణంగా ఒక ప్రాంతానికి ఒకలా సిగ్నల్స్ టైమింగ్ ఉంటుంది. దీని వల్ల అవసరం లేకపోయినా 50 నుంచి 90 సెకన్ల వరకు వాహనదారులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అవసరం లేకపోయినా ఇలా వెయిట్ చేయడం కన్నా.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ట్రాఫిక్ ను రియల్ టైమ్ లో గుర్తించి అప్పటికప్పుడు సిగ్నల్ టైమింగ్ మారిస్తే ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ ఎక్కడా ఆగదు. గచ్చిబౌలిలో ఈ ప్రయోగం చేయబోతున్నారు.  

జన రంజకమైన వార్తలు