• తాజా వార్తలు

తెలంగాణ‌లో ఆస్తుల రిజిస్ట్రేష‌న్ ఆన్‌లైన్‌లో చేసుకోవ‌డానికి సింపుల్ గైడ్

తెలంగాణ ప్ర‌భుత్వం ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ను మూడు నాలుగు నెల‌లుగా ఆపేసింది. వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్‌ను ధ‌ర‌ణి వెబ్‌సైట్ ద్వారా చేయ‌నున్నారు. అయితే ఫ్లాట్స్, ప్లాట్స్‌,  వ్యవ‌సాయ భూములు కాని ఇత‌ర స్థ‌లాలు, ఆస్తులు, ఇండ్లు వంటి వాటి రిజిస్ట్రేష‌న్ కూడా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా చేయ‌బోతున్నారు. అదెలా చేయాలో చూద్దాం.

తెలంగాణ‌లో ఆస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ఇలా..
* బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి https://registration.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
* వెబ్‌సైట్‌లో టాప్‌లోనే నాన్ అగ్రిక‌ల్చ‌ర్ ప్రాప‌ర్టీ రిజిస్ట్రేష‌న్ అని క‌నిపిస్తుంది. దాన్ని క్లి‌క్ చేయండి.
*  స్లాట్ బుకింగ్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇండిపెండెంట్ హౌస్‌,  అపార్ట్‌మెంట్‌, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ అనే  ఆప్ష‌న్లు చూపిస్తుంది. దానిలో నుంచి మీరు రిజిస్ట్రేష‌న్ చేయాల‌నుకుంటున్న ప్రాప‌ర్టీ ఏదైతే దాన్ని సెల‌క్ట్ చేయండి.
* ఏమేం వివ‌రాలు కావాలో చూపిస్తుంది. 
* అవి ఎంట‌ర్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి.
* స్లాట్ బుక్ అయిన త‌ర్వాత మీరు రిజిస్ట్రేష‌న్ టూమ్‌లో ఏమేం డాక్యుమెంట్లు తీసుకురావాలో అన్ని వివ‌రాలు వెబ్‌సైట్‌లోచూపిస్తుంది. అవి తీసుకుని వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.

బిల్డ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా
బిల్డ‌ర్లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు రిజిస్ట్రేష‌న్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవ‌కాశం ఇచ్చారు. ఇదే వెబ్‌సైట్‌లో రైట్‌సైట్‌లో బిల్డ‌ర్‌, డెవ‌ల‌ప‌ర్ లాగిన్ అని ఉంటుంది. అక్క‌డికి వెళ్లి డైరెక్ట్‌గా లాగిన్ అవ్వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు