• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో.. డిగ్రీ అడ్మిష‌న్లు

రోజురోజుకీ విస్త‌రిస్తున్న టెక్నాల‌జీని అన్ని రంగాల్లోకి తీసుకురావ‌డానికి తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌య‌త్నిస్తోంది. మిగిలిన రంగాల‌తో కంపేర్ చేసిన‌ప్పుడు ఎడ్యుకేష‌న్ రంగంలో టెక్నాల‌జీ వినియోగం త‌క్కువే. ఎంసెట్‌, ఐసెట్ వంటి వాటికి ఆన్‌లైన్లో అప్ల‌యి చేయ‌డం, వెబ్ కౌన్సెలింగ్‌, వెబ్ఆప్ష‌న్లు వంటివి మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ రాష్ట్ర స్థాయి విద్యాసంస్థ‌ల్లో ముఖ్యంగా ఇంట‌ర్మీయట్‌, డిగ్రీ లెవెల్లో అడ్మిష‌న్‌, ఎగ్జామ్స్ విష‌యంలో టెక్నాల‌జీకి చోటే లేదు. అందుకే దీనిపై గ‌వ‌ర్న‌మెంట్ దృష్టి పెట్టింది. ఎలాంటి ఫ్రాడ్‌కు అవ‌కాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిష‌న్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్త్‌)కు అనే ఆన్‌లైన్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది. గ‌తేడాదే దీన్ని తీసుకొచ్చినా 50 వ‌ర‌కు ప్రైవేటు కాలేజీలు వెన‌క‌డుగు వేశాయి. ఈసారి ఆ కాలేజీల‌ను కూడా క‌లిపి మొత్తం డిగ్రీ అడ్మిషన్ల‌న్నీ ఆన్‌లైన్ ద్వారానే చేయ‌బోతున్నారు.
ప్రాసెస్ ఏంటి?
మే 8న అడ్మిష‌న్ల ప్రాసెస్ మొద‌ల‌వుతుంది. మే 22 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ త‌ర్వాత మ‌రో రెండు రోజుల‌పాటు 200 రూపాల‌య ఫైన్‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకుని వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవ‌చ్చు. ఇలా అప్ల‌యి చేసిన‌వారికి సీట్లు కేటాయిస్తారు. వీరు జూన్ 5లోగా కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. జూన్‌ 6-8 తేదీల్లో రెండో విడ‌త వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకున్న వారికి 10వ తేదీన‌, జూన్‌ 16-17 తేదీల్లో చివరి విడత వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన‌వారికి జూన్ 19న సీట్స్ అలాట్ చేస్తారు. ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌, మెడిసిన్ వంటి కోర్సుల్లో సీటు రాక డిగ్రీలో జాయిన‌వ్వాల‌నే వారి కోసం మ‌రో ఫేజ్ అవ‌కాశం కల్పించాలా లేదా అనేదానిపై తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ఇంకా ఆలోచిస్తోంది.

జన రంజకమైన వార్తలు