• తాజా వార్తలు

ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

టెలికాం వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో జియో దూసుకెళుతూనే ఉంది. టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ- ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్ ప్ర‌కారం ఎయిర్‌టెల్‌, ఐడియా భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతే జియో మాత్రం కొత్తగా ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించుకుంటూ రేసులో ముందుంది. 

అర‌కోటికి ద‌గ్గ‌ర‌గా లాస్‌
మే నెల‌లో ఎయిర్‌టెల్ 47 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియాకు కూడా 47 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 31.7 కోట్ల‌కు, ఐడియా క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 30.9 కోట్ల‌కు ప‌డిపోయింది. \

40 కోట్ల మార్క్‌ను రీచ్ అవబోతోంది

మ‌రోవైపు జియో మాత్రం దూసుకెళ్లిపోతోంది. మే నెల‌లో జియోకు కొత్త‌గా 36 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు వ‌చ్చి చేరారు. ఇందులో చాలామంది ఐడియా, ఎయిర్‌టెల్ నుంచి వ‌చ్చిన‌వారేన‌ని విశ్లే|ష‌కుల లెక్క‌. కొత్త క‌స్ట‌మ‌ర్ల‌తో క‌లిసి జియో వినియోగదారుల సంఖ్య 39.2 కోట్లకు చేరింది. అంటే త్వ‌ర‌లోనే 40 కోట్ల మార్క్‌ను రీచ్ అవబోతోంది. 

జన రంజకమైన వార్తలు