• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ జియో వ‌ర్సెస్ వొడాఫోన్‌:  రూ.100 లోపు ప్లాన్ల‌లో నిజంగా ఉప‌యోగ‌ప‌డేవేవి?

జియో వ‌చ్చాక ఇండియ‌న్ టెలికం రంగంలో మొద‌లైన పోటీ పీక్స్‌కి చేరిపోయింది. 19 రూపాయ‌ల‌కే డేటా ప్యాక్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం క‌ల్పించే స్థాయికి పోటీ పెరిగిపోయింది. జియోతోపాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ కూడా వంద రూపాయ‌ల్లోపు చాలా ప్లాన్స్‌ను తీసుకొచ్చాయి. అస‌లా ఆ ప్లాన్స్ ఏమిటి?  ఎంత‌వర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయో చూద్దాం.
 

రిల‌య‌న్స్ జియో
రూ.19 ప్యాక్‌: అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌక‌ర్యం, 20 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ,  0.15 జీబీ డేటా ఫ్రీ. ఆ త‌ర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు త‌గ్గిపోతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక్క‌రోజు మాత్ర‌మే.
రూ.52 ప్యాక్‌: అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సౌక‌ర్యం, 70 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ,  రోజుకు 0.15 జీబీ చొప్పున వారం రోజుల‌కు మొత్తం 1.05 జీబీ డేటా ఫ్రీ. ఆ త‌ర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు త‌గ్గిపోతుంది. ఈ ప్లాన్ వారం రోజులు ప‌నిచేస్తుంది.
రూ.98 ప్యాక్‌: త‌క్కువ డేటా ఉన్నా ప‌ర‌వాలేదు ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఉన్నా చాలు అనుకునేవారికి ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న‌ వాటిలో బెస్ట్ ప్లాన్ ఇది. ఎందుకంటే దీనిలో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌తోపాటు 300 ఎస్ఎంస్‌లు ఫ్రీ.వ్యాలిడిటీ 28 రోజులు.  28 రోజుల‌కు క‌లిపి మొత్తం 2జీబీ  డేటా ఫ్రీగా ఇస్తారు.

ఎయిర్‌టెల్
రూ.8 ప్యాక్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌ను నిమిషానికి 30 పైస‌ల‌కుచేసుకోవ‌డానికి ఈ ప్యాక్ ప‌నికొస్తుంది. వ్యాలిడిటీ 56 రోజులు .
రూ.6 ప్యాక్‌: ఎస్టీడీ కాల్స్‌ను నిమిషానికి 25  పైస‌ల‌కు చేసుకోవ‌డానికి ఈ ప్యాక్ ఉప‌యోగ‌ప‌డుతుంది. వ్యాలిడిటీ 28 రోజులు
రూ.17 ప్యాక్‌:  లోక‌ల్ మొబైల్ ఫోన్‌ కాల్స్‌ను 2 సెక‌న్ల‌కు 1.2 పైసాకు చేసుకోవ‌డానికి ఈ ప్యాక్ వాడుకోవ‌చ్చు.  వ్యాలిడిటీ 28 రోజులు .
రూ.40 ప్యాక్‌:  35 రూపాయ‌ల టాక్‌టైమ్ వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీ అంటే ఎప్పుడైనా  వాడుకోవ‌చ్చు.
రూ.48 ప్యాక్‌:   జ‌స్ట్ బేసిక్ డేటా ప్యాక్ చాలనుకునే యూజ‌ర్ల‌కు ప‌నికొస్తుంది.  28 రోజుల‌కు క‌లిపి 1జీబీ డేటా వ‌స్తుంది.                       
 రూ.98 ప్యాక్‌:  బేసిక్ కంటే కాస్త ఎక్క‌వ డేటా కావాల‌నుకుంటే ఈ ప్యాక్ వాడుకోవ‌చ్చు.   28 రోజుల‌కు మొత్తం 5 జీబీ డేటా వ‌స్తుంది.   
రూ.99 ప్యాక్‌: ఎయిర్‌టెల్‌లోనే కాదు మిగిలిన కంపెనీల‌తో పోల్చుకున్నా మార్కెట్‌లో  ఉన్న ది బెస్ట్ ఆఫ‌ర్ ఇదీ.. 99 రూపాయ‌ల‌తో ఈ ప్యాక్ వేయించుకుంటే ఎందుకంటే  అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఫ్రీ. రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. రోజుకు 1జీబీ డేటా చొప్పున  30 జీబీ డేటా ఫ్రీ.  వ్యాలిడిటీ 28 రోజులు. 
 

వొడాఫోన్ 
రూ.29ప్యాక్‌: ఇది కేవ‌లం ఇంట‌ర్నెట్ ప్యాక్ మాత్ర‌మే. అంటే ఎలాంటి ఫ్రీ కాల్స్‌, టాక్‌టైమ్ ఉండ‌వు. 28 రోజుల‌పాటు డేటా ఇస్తారు.
రూ.37 ప్యాక్‌: ఐదు రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఇంట‌ర్నెట్ ప్యాక్‌లో 375 ఎంబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది. త‌ర్వాత 10 కేబీకి 4 పైస‌లు వ‌సూలు చేస్తారు.
రూ.95 ప్యాక్‌: ఇది కూడా డేటా ప్యాక్ మాత్ర‌మే. 1జీబీ డేటా చొప్పున డేటా ఇస్తుంది.  త‌ర్వాత 10 కేబీకి 4 పైస‌లు ఛార్జి ప‌డుతుంది.
ఓవ‌రాల్‌గా చూస్తే ఈ డేటా ప్యాక్‌ల‌కు పెట్టే సొమ్ముతో జియో, ఎయిర్‌టెల్‌లో 28 రోజుల‌పాటు ఫుల్ మొబైల్ ప్యాక్ వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు