• తాజా వార్తలు

ఏమిటీ బీఎస్ఎన్ఎల్ అడ్వాన్స్డ్ రెంట‌ల్ ప్లాన్‌? 

ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఓప‌క్కన ఉద్యోగుల‌ను త‌గ్గించుకుంటూ, వీఆర్ఎస్‌లు ఇచ్చి బ‌య‌టికి పంపేస్తూ వార్త‌ల్లో క‌నిపిస్తోంది. మ‌రోపక్క మార్కెట్‌లో నిల‌బ‌డ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఏజీఆర్ బ‌కాయిలు భార‌మవుతున్నాయ‌ని, మెయింట‌నెన్స్ ఖ‌ర్చులు పెరుగుతున్నాయ‌ని చ‌డీచ‌ప్పుడూ లేకుండా అన్ని  కంపెనీలూ మొబైల్ టారిఫ్‌లు పెంచేస్తే బీఎస్ఎన్ఎల్ మాత్రం పాత టారిఫ్‌ల‌నే కొన‌సాగిస్తోంది. లేటెస్ట్‌గా త‌క్కువ రేట్‌తోనే ఎక్కువ కాలం డేటా ఇచ్చే కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ అడ్వాన్స్డ్ రెంట‌ల్ ప్లాన్ అని దీనికి పేరు పెట్టింది.  బీఎస్ఎన్ఎల్ చైన్నై స‌ర్కిల్‌లో మార్చి 1 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లో మిగ‌తా స‌ర్కిల్స్‌కూ వ‌స్తుంది.

ఏమిటీ ప్లాన్ స్పెష‌ల్‌? 
998 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకుంటే 9 నెల‌లు (270 రోజులు) రోజుకు 2జీబీ డేటా ఇచ్చేందుకు ఓ ప్లాన్‌ను లాస్ట్ ఇయ‌రే రిలీజ్ చేసింది. దీన్నే కొద్దిగా అప్‌గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ రెంట‌ల్ ప్లాన్‌గా పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చింది.  పోస్ట్‌పెయిడ్ ఆఫరే అయినా ముందే డ‌బ్బులు క‌ట్టేయాలి కాబ‌ట్టి అడ్వాన్స్డ్ రెంట‌ల్ ప్లాన్ అని పేరు పెట్టింది. ఇందులో రెండు ర‌కాల ఆప్ష‌న్లు ఉన్నాయి 

ఆప్ష‌న్లేమిటి?
ఆప్ష‌న్ 1:  
బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు 11 నెల‌ల రెంట‌ల్ విత్ జీఎస్టీ ముందే పే చేస్తే 12 నెల‌లకు వ్యాలిడిటీ వ‌స్తుంది.  
ఆప్ష‌న్ 2: ఇందులో 21 నెల‌ల‌కు రెంట‌ల్ విత్ జీఎస్టీ పే చేస్తే 24 నెల‌లు ప్లాన్ ఇస్తారు. 

జన రంజకమైన వార్తలు