• తాజా వార్తలు

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ .. 600 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ దూకుడు పెంచింది. క‌రోనా టైమ్‌లో బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు ఇంట‌ర్నెట్ ప్ర‌యోజ‌నాలు బాగా ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా 600 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ టెలికం కంపెనీల‌న్నీ ఏడాది (365 రోజుల) ప్రీపెయిడ్ ప్లాన్‌లే అత్య‌ధిక వ్యాలిడిటీక‌లిగిన ప్లాన్‌లు. ఇప్పుడు ఈ రికార్డ్‌ను బీఎస్ఎన్ఎల్ బ‌ద్ద‌లుగొట్టింది. 

ఏమిటీ ప్లాన్‌? ప‌్రయోజ‌నాలేంటి?
ప్లాన్‌: బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 

వ్యాలిడిటీ: 600 రోజులు 

రోజూ 250 నిమిషాల టాక్‌టైం

రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం

తొలి రెండు నెల‌లు  బీఎస్ఎన్ఎల్ కాల‌ర్ ట్యూన్స్ ఫ్రీ  

డేటా బెనిఫిట్స్ లేవు
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఎలాంటి డేటా బెనిఫిట్స్ లేక‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ప్ర‌ధానంగా కాల్స్, ఎస్ఎంఎస్‌ల మీదే ఎక్కువ‌గా ఆధార‌ప‌డే సాంప్ర‌దాయ యూజ‌ర్ల కోస‌మే ఈ ప్లాన్ ఉద్దేశించిన‌ట్లు క‌నిపిస్తోంది. డేటా కావాల‌నుకుంటే యాడ్ ఆన్ డేటా ప్యాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి 
బీఎస్ఎన్ఎల్ త‌న చత్తీస్‌గఢ్ ట్విటర్ హ్యాండిల్ ద్వారాఈ ప్లాన్‌ను ప్ర‌క‌టించింది.  అయితే దేశవ్యాప్తంగా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. 
 

జన రంజకమైన వార్తలు