జియో ఇప్పడు ఇండియాలో బాగా పాపులరయిన నెట్‌వర్క్. మీ జియో నెంబర్‌ను మీరు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం జియో 575 రూపాయల నుంచి 5751 రూపాయల వరకు వివిధ రకాల ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ అందిస్తోంది. జియోకు ఇండియాలో ఉన్న 20 రీజియన్లలో ఈ ప్లాన్లలో కాస్త మార్పు ఉండొచ్చు. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ రోమింగ్ ఫెసిలిటీని మీ జియో నెంబర్‌పై వాడుకోవాలనుకుంటే ఈ ప్లాన్ తీసుకునే ముందు కస్టమర్ కేర్‌తో మాట్లాడి మీ అవసరాలకు తగ్గ ప్లాన్ ఎంచుకోండి. జియోలో ఉన్న వివిధ రకాల ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ ఇవీ..
జియో 575 రూపాయల ప్యాక్
దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. అన్‌లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితం. మీరు వెళ్లిన దేశంలో లోకల్ కాల్స్ లేదా ఇండియాకు కాల్ చేసుకోవడానికి 100 నిముషాల అవుట్ గోయింగ్ ఫ్రీ. 100 ఇంటర్నేషనల్ రోమింగ్ ఎస్ఎంఎస్‌లు ఫ్‌రీ. దీంతోపాటు 250 ఎంబీ హై స్పీడ్ డేటా ఫ్రీ. ఈ డేటా వాడేస్తే తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది.
జియో 1101 రూపాయల ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్
దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. అన్‌లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితం. వ్యాలిడిటీ 28 రోజులు. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, డేటా యూసేజ్‌కు ఛార్జి పడుతుంది. ఏయే దేశాల్లో ఈ ప్లాన్ పని చేస్తుంది, ఎంత ఛార్జి పడుతుంది తెలుసుకోవాలంటే http://jep-asset.jio.com/jio/plan/IR-packs.pdfని చూడండి.
జియో 2875 రూపాయల ప్యాక్
దీని వ్యాలిడిటీ ఏడు రోజులు మాత్రమే. అన్‌లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితం. మీరు వెళ్లిన దేశంలో లోకల్ కాల్స్ లేదా ఇండియాకు కాల్ చేసుకోవడానికి రోజుకు 100 నిముషాల అవుట్ గోయింగ్ ఫ్రీ. రోజుకు 100 ఇంటర్నేషనల్ రోమింగ్ ఎస్ఎంఎస్‌లు ఉచితం. దీంతోపాటు రోజుకు 250 ఎంబీ హై స్పీడ్ డేటా ఫ్రీ. ఈ డేటా వాడేస్తే తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది.
జియో 5751 రూపాయల ప్యాక్
దీని వ్యాలిడిటీ 30 రోజులు. అన్‌లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితం. వ్యాలిడిటీ పిరియడ్ మొత్తానికి 1500 నిముషాల ఫ్రీ అవుట్ గోయింగ్ కాల్స్ ఉంటాయి. అలాగే 1500 ఇంటర్నేషనల్ రోమింగ్ ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. వీటిని మీరు వెళ్లిన దేశంలో లోకల్ కాల్స్ లేదా ఇండియాకు కాల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. దీంతోపాటు నెల మొత్తానికి కలిపి 5జీబీ హై స్పీడ్ డేటా ఫ్రీ. ఈ డేటా వాడేస్తే తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వస్తుంది.
ఏయే దేశాల్లో పని చేస్తాయి?
అమెరికా, బ్రిటన్, యూఏఈ, శ్రీలంక, సింగపూర్, థాయ్‌ల్యాండ్, మలేషియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, పోర్చుగల్, రొమేనియా,స్పెయిన్, టర్కీ దేశాల్లో అక్కడున్న టెలికం కంపెనీలతో జియో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. దీంతో జియో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ ఈ దేశాల్లో పని చేస్తాయి.