• తాజా వార్తలు

జియో కస్టమర్లకు డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్ వీఐపీ మెంబ‌ర్‌షిప్ ఏడాదిపాటు ఫ్రీ

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో శుభవార్త‌. త‌న వినియోగ‌దారులంద‌రికీ డిస్నీప్లస్ హాట్‌స్టార్  వీఐపీ మెంబర్‌షిప్ ఉచితంగా అందించ‌నున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది. 

ఏడాదిపాటు ఉచితం
* జియో క‌స్ట‌మ‌ర్లంద‌రికీ డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్ మెంబ‌ర్‌షిప్‌ను ఏడాదిపాటు  ఉచితంగా అందిస్తోంది.  
* దీని విలువ రూ.399 రూపాయ‌లు. 
* ఈ ఆఫ‌ర్ జియో కస్టమర్లందరికీ వర్తిస్తుంది. 
* నెలవారీ, ఏడాది రీఛార్జి ప్లాన్స్ తీసుకునేవారంద‌రికీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ మెంబర్‌షిప్ లభించనుంది. 
* రూ.401, రూ. 2599 ప్లాన్లతోపాటు యాడ్‌ఆన్‌గా రూ.612తో కూడా డిస్నీప్లస్‌ను కొనుగోలు చేయొచ్చు.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ వీఐపీ మెంబ‌ర్‌షిప్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో ఉప‌యోగాలు ఏంటంటే..
* డిస్నీ ప్ల‌స్‌, ఎక్స్‌క్లూజివ్ హాట్‌స్టార్ స్పెష‌ల్స్‌ను వీక్షించ‌వ‌చ్చు.

* ఇండియ‌న్ టీవీ షోల లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడొచ్చు. 

* ఇండియ‌న్ మూవీస్ కూడా అందుబాటులో ఉంటాయి.  

* హాట్‌స్టార్‌లో లైవ్  స్పోర్ట్స్ కూడా చూడొచ్చు. 

జన రంజకమైన వార్తలు