• తాజా వార్తలు

ఎయిర్‌టెల్, జియో, ఐడియా డౌన్‌లోడ్ స్పీడ్ పెరిగింద‌ట.. గుర్తించారా?

ఇండియన్ టెలికం రంగంలో ప్ర‌ధాన పోటీదారులైన ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ ఐడియా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఆఫ‌ర్లతోపాటు స‌ర్వీస్ మెరుగుప‌రుచుకోవ‌డానికీ గ‌ట్టిగానే కృషి చేస్తున్నాయి.  లాక్‌డౌన్ టైమ్‌లో దాదాపు అన్ని మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు కూడా మంచి స్పీడ్‌తోనే ప‌నిచేశాయి. డౌన్‌లోడ్స్ విష‌యంలోనూ స్పీడ్ బాగానే మెయిన్‌టెయిన్ చేశాయి. టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ (ట్రాయ్) కూడా ఇదే విష‌యాన్ని చెప్పింది.

డౌన్‌లోడ్ స్పీడ్ అందుకుంది
 మై స్పీడ్ యాప్ అని ఒక యాప్‌ను ట్రాయ్ త‌యారుచేసింది. దీంతో టెలికం నెట్‌వ‌ర్క్‌ల స్పీడ్‌ను ప్ర‌తి నెలా లెక్క‌క‌డుతుంది. ఈ యాప్ ద్వారా ప‌రిశీలించి  ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఇంప్రూవ్‌మెంట్ సాధించాయ‌ని ట్రాయ్ తెలిపింది. ఏప్రిల్‌తో పోల్చితే మేలో ఈ నెట్‌వ‌ర్క్‌ల్లో స్పీడ్ బాగుంద‌ని చెప్పింది.

జియోనే టాప్‌
ఇంత‌కుముందు నెల‌ల మాదిరిగానే ఈసారి కూడా డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో ఫ‌స్ట‌ప్లేస్‌లో ఉంది. మే నెల‌లో జియో డౌన్లోడ్ స్పీడ్ 14.1 ఎంబీపీఎస్‌. అంటే సెక‌నుకు 14.1 ఎంబీపీఎస్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయ‌గ‌లిగింది. ఎయిర్‌టెల్ 7.1 ఎంబీపీఎస్ స్పీడ్‌ను రికార్డ్ చేయ‌గ‌లిగింది. చివ‌రిగా  ఐడియా నిలిచింది. దీనిలో డౌన్లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ అని ట్రాయ్ తేల్చింది. సో జియో మిగిలిన నెట్‌వ‌ర్క్‌ల కంటే రెట్టింపు వేగంతో డౌన్‌లోడ్  చేయ‌గ‌లిగే అవ‌కాశాన్ని ఖాతాదారుల‌కు ఇచ్చింద‌న్న‌మాట‌. 

జన రంజకమైన వార్తలు