రిలయన్స్ జియో మొబైల్ తయారీ సంస్థ షియోమీతో టై అప్ చేసుకుని అదనపు డాటా ప్రయోజనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. షియోమీ(రెడ్ మీ) ఫోన్లు వాడుతున్న యూజర్లకు జియో సిమ్‌లపై మొత్తం 30 జీబీ 4జీ డేటాను ఉచితంగా అందిస్తున్నారు.
ఏఏ మోడళ్లపై...
రెడ్‌మీ2, రెడ్‌మీ 2 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 4జీ, రెడ్‌మీ నోట్ 4జీ ప్రైమ్, ఎంఐ 4ఐ, రెడ్‌మీ నోట్ 2, ఎంఐ5, ఎంఐ మ్యాక్స్, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్, రెడ్‌మీ 3ఎస్, రెడ్‌మీ 3ఎస్ ప్లస్, రెడ్‌మీ 3ఎస్ ప్రైమ్, రెడ్‌మీ నోట్ 4, రెడ్‌మీ 4ఏ, రెడ్‌మీ4
అదనపు డాటా పొందడం ఎలా?
ఈ మోడళ్ల ఫోన్లు ఉన్నవారు జియో సిమ్ కు రూ.309 ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రీచార్జి చేసుకున్న 48 గంటల్లోగా ఉచితంగా 5జీబీ 4జీ డేటా క్రెడిట్ అవుతుంది. ఇలా మార్చి 31, 2018 వరకు ఈ ఫోన్లు ఉన్న యూజర్లు గరిష్టంగా 6 సార్లు రూ.309 ప్యాక్‌తో రీచార్జి చేసుకోవచ్చు. దీంతో వారికి రీచార్జి చేసుకున్నప్పుడల్లా అదనంగా 5జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే మొత్తంగా 30 జీబీ వస్తుందన్నమాట.