• తాజా వార్తలు

ఇక‌పై మొబైల్ రీఛార్జి గూగుల్‌లోనే చేసుకోవ‌చ్చు ఇలా..

టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్.. రోజుకో కొత్త ఫీచ‌ర్‌తో యూజ‌ర్ల‌ను క‌ట్టిప‌డేస్తోంది.  బ‌స్ టికెట్‌, ట్రయిన్ టికెట్స్‌,  హోట‌ల్ బుకింగ్స్‌, జాబ్ సెర్చింగ్ ఇలా అన్నింటినీ త‌న ఫ్లాట్‌ఫామ్ మీదే అందిస్తోంది. ఇప్పుడు అత్యంత గిరాకీ ఉండే మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జిని కూడా గూగుల్‌లోనే చేసుకునేలా కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. 

యూజ‌ర్‌కు ఉప‌యోగం ఏంటంటే..
ఇండియాలో 110 కోట్ల మొబైల్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. ఇందులో 95 శాతం ప్రీపెయిడ్‌వే. అంటే ఎప్ప‌టిక‌ప్పుడు రీఛార్జి చేసుకోవాలి. అందుకే ఈ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా త‌న ఫ్లాట్‌ఫామ్ మీదే రీఛార్జి ఆప్ష‌న్‌ను కూడా గూగుల్ ప్ర‌వేశ‌పెట్టింది.  

*ఇక ఏ మొబైల్ నెట్‌వ‌ర్క్ వాడుతున్న ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌యినా గూగుల్‌లోనే  వాటి గురించి సెర్చ్ చేసుకోవ‌చ్చు, ఏయే ప్లాన్స్ ఉన్నాయి.. వాటి ధర ఎంత‌?  ఇత‌ర వాటితో కంపేర్ చేసుకోవ‌చ్చు. 

* ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ క‌నెక్ష‌న్ల రీఛార్జి చేసుకోవ‌డానికి ఆప్ష‌న్లు ఇచ్చింది. 

* గూగుల్ పేజీ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఆ సెర్చ్ పేజీ నుంచే రీఛార్జి కూడా చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ర‌కర‌కాల పేమెంట్ ఆప్ష‌న్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.  మొబీక్విక్, పేటీఎం, ఫ్రీఛార్జి, గూగుల్ పే లాంటి మొబైల్ వాలెట్ల‌న్నీ అందుబాటులో పెట్టింది. 

ప్రీపెయిడ్ రీఛార్జి గూగుల్‌లో చేసుకోవ‌డం ఎలా? 
గూగుల్ సెర్చ్‌లో mobile recharge లేదా sim recharge అని టైప్ చేసి సెర్చ్ చేయండి.  

* ఇక్క‌డ మీ ఫోన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేసి మొబైల్ నెట్‌వ‌ర్క్ సెలెక్ట్ చేయండి.

* సెర్చ్ రిజ‌ల్ట్స్‌లో మీ వ‌చ్చిన వాటిలో Browse plansని క్లిక్ చేయండి. 

* మీకు కావాల్సిన ప్లాన్‌ను సెల‌క్ట్ చేసుకుని రీఛార్జి చేసుకోండి. 

* పేమెంట్స్ ఆప్ష‌న్ల లో మొబీక్విక్, పేటీఎం, ఫ్రీఛార్జి, గూగుల్ పే లాంటి మొబైల్ వాలెట్ల‌న్నీ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకుని పే చేయొచ్చు.

* ముందు ముందు మ‌రిన్ని పేమెంట్ ఆప్ష‌న్లు అందుబాటులోకి తేబోతోంది.  

జన రంజకమైన వార్తలు