టెలికం రంగంలో సీన్ మారిపోయింది. నిన్నటి దాకా పోటీలుపడి ఆఫర్లు ఇచ్చిన కంపెనీలన్నీ ఇప్పుడు రివర్స్ టెండరింగ్ మొదలెట్టాయి. టారిఫ్ పెంచడంలో ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. ఛార్జీల పెంపు తప్పదని జియో ఇప్పటికే ప్రకటించింది. ఇతర నెట్‌వర్క్‌లు చేసే కాల్స్‌కు ఆల్రెడీ నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు కూడా చేస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇలా అన్ని కంపెనీలు డిసెంబర్ 1 నుంచి కనీసం 15నుంచి 20% ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇందులో ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఓ చిన్న ఊరట. ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్ అనే కొత్త స్కీంను ఎయిర్‌టెల్ తెచ్చింది.
ఏమిటీ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్? ఎలా పని చేస్తుంది?
అన్‌లిమిటెడ్ ప్రీ పెయిడ్ ప్లాన్స్ వాడుతున్న వినియోగదారులు తాము ఏ ప్లాన్‌లో ఉన్నారో ఆ ప్లాన్‌ను డిసెంబర్ 1లోగా రీఛార్జి చేయించుకోవాలి. అప్పుడు పాత ధరకే లభిస్తుంది. ఒకవేళ మీ ప్లాన్ గడువు ఇంకా ఉన్నా కూడా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కొనుక్కోవచ్చు. ఆ ప్లాన్ గడువు ముగిశాక కొత్త రీఛార్జి ప్లాన్ వాడుకలోకి వస్తుంది. అంటే అప్పటి వరకు కొత్త రీఛార్జి అమౌంట్ క్యూలో ఉంటుందన్నమాట.
ఉదాహరణకు ఎయిర్‌టెల్‌లో 28 రోజులకు 190 రూపాయల అన్‌లిమిటెడ్ వాయిస్ రీఛార్జి ప్లాన్ ఉంది. ధరలు పెరిగాక ఇది కనీసం 219 రూపాయలు అవుతుంది. డిసెంబర్ 1లోగా దీన్ని 199 రూపాయలకే రీఛార్జి చేయించుకోవచ్చు. మీ పాత ప్రీపెయిడ్ ప్లాన్ గడువు డిసెంబర్ 20కి ముగుస్తుందనుకోండి. 21 నుంచి కొత్తగా రీఛార్జి చేసిన ప్లాన్ అమల్లోకి వస్తుంది.
జియోకి పోటీగానే
జియో ఇప్పటికే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్‌ను ఫాలో అవుతోంది. దీంతో తమ కస్టమర్లు ఎక్కడా అసంతృప్తి చెందకుండా ఎయిర్‌టెల్ కూడా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్‌ను తీసుకొచ్చింది.
* ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లేదా పేటీఎం లేదా ఇతర రీఛార్జి పోర్టల్స్‌లోకి వెళ్లండి. మీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీఛార్జి చేసకోండి.
* పాత ప్లాన్ ముగిసేవరకు ఆ గడువునే ఎక్స్‌పైరీ డేట్‌గా యాప్ చూపిస్తుంది. అది అయిపోగానే మీరు ముందే క్యూ చేసి పెట్టిన రీఛార్జి ప్లాన్ అమల్లోకి వస్తుంది.
* ఛార్జీల పెంపు భారం తగ్గించుకోవాలనుకుంటే 1,699 రూపాయల ఎయిర్‌టెల్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా మీరు క్యూయింగ్‌లో భాగంగా కొనుక్కోవచ్చు. అప్పుడు మీరు పాత టారిఫ్‌తోనే ఒక సంవత్సరం ఎయిర్‌టెల్ సర్వీసులు వాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. త్వరపడండి.
1