• తాజా వార్తలు

డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి ఎయిర్‌టెల్ సూప‌ర్ కాంబో 401 రూపాయ‌ల‌కే

టెలికం  టాప్‌స్టార్ ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ వినియోగ‌దారుల కోసం అదిరిపోయే కాంబో ఆఫ‌ర్ తీసుకొచ్చింది. 28 రోజుల రీఛార్జి ప్లాన్‌తో కాల్స్‌, డేటానే కాకుండా డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌ను కూడా ఫ్రీగా అందిస్తోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంటికే పరిమిత‌మైన యూజ‌ర్ల‌కు ఇదో అద్భుత అవ‌కాశం అంటూ ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఏమిటీ ప్లాన్‌?
* 401 రూపాయ‌ల‌తో ఈ రీఛార్జి చేసుకోవాలి
* వ్యాలిడిటీ 28 రోజులు
* అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్‌
* 3జీబీ డేటా ఫ్రీ
* దీంతోపాటు ప్ర‌ముఖ  స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్ ఏడాది స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ఫ్రీ. అంటే ఒక్కసారి ఈ ఆఫ‌ర్ తీసుకుంటే ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీడియోలు, మూవీల‌న్నీ ఏడాది పాటు ఫ్రీగా చూడొచ్చు.

డిస్నీతో జ‌ట్టుక‌ట్టింది
 దేశంలో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ బాగా పెరుగుతోంది. అందుకే డిస్నీ+ హాట్‌స్టార్‌తో క‌లిసి ఈ ఆఫ‌ర్‌ను వినియోగదారులకు అందిస్తున్న‌ట్లు ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. దేశంలోని ప్రతి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుడు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్
ఈ ఆఫర్‌ను పొందిన వినియోగదారులకు డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్‌ లభిస్తుంది. దీంతో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ మొదలైన అనేక భాషల్లోని సరికొత్త సినిమాలు, చిన్నారుల యానిమేషన్ సినిమాలు, హాట్‌స్టార్ ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ప్రోగ్రాంలు, స్పోర్ట్స్ వంటి ఇష్టమైన అన్ని ప్రోగ్రాంలను చూడొచ్చ‌ని డిస్నీ+హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది. వీఐపీ ప్యాక్ కాబ‌ట్టి వాటిని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో కూడా చూసేయొచ్చు.

 

 

జన రంజకమైన వార్తలు