ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు బ్రాడ్‌బ్యాండ్‌లో ఇప్పటికీ మంచి వాటానే ఉంది. డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో మార్కెట్లో ఉంది. అయితే ప్రైవేట్ ఆపరేటర్లతో స్పీడ్‌లో, సర్వీస్‌లో పోటీపడలేకపోవడం దీనికి మైనస్. అయితే వీటన్నింటినీ అధిగమించి మార్కెట్లో మళ్లీ పోటీలోకి రావడానికి బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తోంది. అందుకే లేటెస్ట్‌గా నెలకు కేవలం 299 రూపాయలకే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది
ఏమిటీ 299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్?
* బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ తీసుకోవాలనుకునే కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది.
* తొలి ఆరు నెలలు నెలకు 299 రూపాయలు చెల్లించాలి.
* 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటా నెలకు ఇస్తుంది.
* 100 జీబీ డేటా అయిపోయాక కూడా నెట్ పనిచేస్తుంది. అయితే స్పీడ్ 2ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది.
* అంతేకాదు డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తోపాటు ల్యాండ్‌లైన్ కనెక్షన్ కూడా ఉచితం. ఈ ఫోన్‌తో యూజర్లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ టాక్‌టైమ్ కూడా లభిస్తుంది.
ఆర్నెల్ల తర్వాత ప్లాన్ మారిపోతుంది
* ఆర్నెల్ల తర్వాత ఈ 299 ప్లాన్ యూజర్లు ఆటోమేటిగ్గా 200 జీబీ సీయూఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ఈ ప్లాన్ రెంట్ నెలకు 399 రూపాయలు. 200 జీబీ డేటా, 10 ఎంబీఎస్ స్పీడ్‌తో వస్తుంది.
స్పీడ్ తక్కువైనా స్టేబుల్
ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కాకపోవడంతో దీనిలో స్పీడ్ తక్కువగా ఉంటుంది. అయినా కూడా బీఎస్ఎన్ఎల్ కాబట్టి నెట్‌వర్క్ స్టేబుల్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్నెట్ వాడాలనుకునే సాధారణ యూజర్లకు ఇది మంచి ప్లానే.