• తాజా వార్తలు

ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.  రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివ‌రాలివీ.  ఈ ప్లాన్స్ వ‌చ్చాక  రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొల‌గించ‌నుంది.   

బీఎస్ఎన్ఎల్ రూ.798 పోస్ట్ పెయిడ్ ప్లాన్ 
నెలకు 50 జీబీ డేటా 
150 జీబీ వ‌ర‌కు డేటా రోల్ ఓవర్ సౌకర్యం (అంటే మిగిలిపోయిన డేటాను త‌ర్వాత నెల‌లో వాడుకోవ‌చ్చు. ఇలా 150 జీబీ వ‌ర‌కు డేటాను త‌ర్వాత నెల‌కు వాడుకోవ‌చ్చు )  
అన్‌లిమిటెడ్ కాల్స్ (లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్ రోజుకు 250 నిమిషాలు వాడుకోవ‌చ్చు)
రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 
రెండు ఫ్యామిలీ-యాడ్ ఆన్ కనెక్షన్స్ ఇస్తుంది. మెయిన్ క‌నెక్ష‌న్తోపాటు ఈ క‌నెక్ష‌న్లు వాడేవారు ఈ డేటాను షేర్ చేసుకోవ‌చ్చు. 


బీఎస్ఎన్ఎల్ రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
* నెలకు 75 జీబీ డేటా 
* 225 జీబీ వ‌ర‌కు డేటా రోలోవర్ సౌకర్యం  
* లోకల్, ఎస్టీడీ నెట్ వర్క్‌కు అపరిమిత వాయిస్ కాల్స్ ( రోజుకు 250 నిమిషాల లిమిట్‌)  
 * రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
* 3 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్స్...

రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రివైజ్డ్ 
ఇక ఇప్ప‌టికే ఉన్న 199 రూపాయ‌ల‌ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను రివైజ్ చేస్తామ‌ని బీఎస్ఎన్ఎల్ ప్ర‌క‌టించింది. 
*నెలకు 25 జీబీ డేటా 
* 75 జీబీ వరకు రోలోవర్ డేటా
*  రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
* బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ  
* ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 300 నిమిషాల   ఫ్రీ

జన రంజకమైన వార్తలు