జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లను తట్టుకుని మార్కెట్లో నిలదొక్కకోవడానికి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా సరికొత్త స్కీమ్‌ను లేటెస్ట్‌గా అనౌన్స్ చేసింది. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌లను ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కొంటే నెల రోజులపాటు ఫ్రీ సర్వీస్ ఇస్తామని ప్రకటించింది.
ఈ ఆఫర్‌లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్, FTTH, బ్రాడ్‌బ్యాండ్ ఇలా ఏ కనెక్షన్ అయినా తీసుకోవచ్చు. సోషల్ మీడియాలోని కోట్ల మంది యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది.
ఎలా అప్లయి చేయాలి?
సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌లను తీసుకోవాలనుకుంటే యూజర్ ఆ లింక్‌లోకి వెళ్లి లీడ్ డిటైల్, పర్సనల్ డిటైల్స్ హెడ్స్‌లో ఉన్న పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ డిటెయిల్స్ ఇవ్వాలి.
* వీటిని సబ్మిట్ చేయగానే మీ బుకింగ్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్లు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ మీకో మెసేజ్‌ను స్క్రీన్ మీద చూపిస్తుంది.
* ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్ మిమ్మల్ని సంప్రదించి మీ కనెక్షన్ తీసుకునే ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు.
* దేశ వ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.