• తాజా వార్తలు

బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం ప్యాక్‌.. 251 రూపాయ‌ల‌కే 70జీబీ డేటా

ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వ‌ర్క్ ఫ్రం హోం యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే 70 జీబీ డేటా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ డేటా ప్లాన్ ఇదేన‌ని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఇత‌ర కంపెనీలు ఈ ధ‌ర‌లోఎంత డేటా ఇస్తున్నాయో చూద్దాం.

జియో
జియోలో కూడా  251 రూపాయ‌ల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది  50 జీబీ డేటా ఇస్తుంది. అంటే బీఎస్ఎన్ఎల్‌తో పోల్చితే 20 జీబీ త‌క్కువ‌.  అయితే ఈ ప్యాక్ వాలిడిటీ 30 రోజులు.

ఎయిర్‌టెల్ 
ఎయిర్‌టెల్‌లో కూడా 251 రూపాయ‌ల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది 50 జీబీ డేటా ఇస్తుంది.  అంటే బీఎస్ఎన్ఎల్‌తో పోల్చితే 20 జీబీ త‌క్కువ‌.   ఈ ప్యాక్‌కు ఎలాంటి వాలిడిటీ లేదు. మీరు ఇప్ప‌టికే వాడుతున్న ప్లాన్‌కు ఇది టాప్ అప్ మాత్ర‌మే. మీ ప్ర‌స్తుత ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే దీన్ని వాడుకోగ‌లుగుతారు.  
 
వొడాఫోన్ ఐడియా (వీఐ)
వీఐలో కూడా  251 రూపాయ‌ల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది 50 జీబీ డేటా ఇస్తుంది.  అంటే బీఎస్ఎన్ఎల్‌తో పోల్చితే 20 జీబీ త‌క్కువ‌.   దీని వాలిడిటీ 28 రోజులు.  

బీఎస్ఎన్ఎల్ బెట‌ర్‌
డేటా ప‌రంగా చూస్తే ఈ 251 రూపాయ‌ల ఎస్టీవీ సెగ్మెంట్‌లో బీఎస్ఎన్ఎల్లే టాప్‌. అయితే  మీ ఏరియాలో ఏ కంపెనీ నెట్‌వ‌ర్క్ బాగుందో చూసుకోవాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు