• తాజా వార్తలు

బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రోజుకో రూపాయితో ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్

ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విప‌రీత‌మైన పోటీ వ‌స్తుండ‌టంతో ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచ‌న చేస్తోంది. తాజాగా 365 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే ఏడాది పొడ‌వునా వాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అంటే  రోజుకు కేవలం ఒక్క రూపాయి అన్న‌మాట‌. బీఎస్ఎన్ఎల్  ఫ‌స్ట్‌ ఈ ప్లాన్‌ను కేరళలో ప్రకటించింది . తర్వాత ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అంటే  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని యూజర్ల‌కూ అందిస్తోంది. | ఇంత‌కీ ఈ ప్లాన్ విశేషాలేమిటో తెలుసుకుందాం. 

మొద‌టి 60 రోజులు సూప‌ర్
 రూ.365 రీఛార్జ్ చేసినవారికి ఏడాది పొడ‌వునా వ్యాలిడిటీ ఉంటుంది.
*  అయితే మొద‌టి రెండు నెల‌లు మాత్రం ఈ ప్లాన్ సూప‌ర్‌గా ఉంది. ఎందుకంటే ప్లాన్ రీఛార్జి చేసిన త‌ర్వాత మొద‌టి 60 రోజులూ రోజుకు  250 నిమిషాల ఫ్రీ కాల్స్ చేసుకోవ‌చ్చు.  
రోజూ 2జీబీ డేటా కూడా ఫ్రీ  
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.  

త‌ర్వాత ఏంటి? 
ఈ 60 రోజుల ఆఫ‌ర్ ముగిసిన త‌ర్వాత  వాయిస్ కాల్స్‌, డేటా కావాలంటే అద‌నంగా రీఛార్జి చేయించుకోవాలి. అయితే ఇన్‌క‌మింగ్ మాత్రం ఏడాదంతా వ‌స్తుఃంది. 

బెస్ట్ ఆఫ‌రే 
ఏడాదంతా వ్యాలిడిటీ, మొద‌టి రెండు నెల‌లు రోజూ 2జీబీ డేటా, రోజుకు 250 ఫ్రీ కాల్స్ వంటివ‌న్నీ ఇచ్చే ప్లాన్‌ను 365 రూపాయ‌ల‌కు అందిస్తుంది కాబ‌ట్టి ఏ ర‌కంగా చూసినా మార్కెట్లో ఇది మంచి ఆఫ‌రే అని చెప్పాలి.  ‌

జన రంజకమైన వార్తలు