• తాజా వార్తలు

జియోలో సంవ‌త్స‌రం రీఛార్జి ప్లాన్స్ అన్నిటి వివ‌రాలు మీకోసం

రిల‌య‌న్స్ జియో ఏడాది ప్లాన్స్‌లో టాప్ అన‌ద‌గిన 4999 రూపాయ‌ల ప్లాన్‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టింది.  దీంతోపాటు ఏడాది వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్స్ గురించి ఓ లుక్కేద్దాం

జియో 4,999 ప్లాన్
* 4,999 రూపాయ‌ల‌తో రీఛార్జి  చేయించుకుంటే వ్యాలిడిటీ 360 రోజులు.
* రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.
* మొత్తంగా 350 జీబీ 4జీ డేటా ఫ్రీ. దీన్ని ఏ రోజు ఎంతైనా వాడుకోవ‌చ్చు
* జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 12వేల నిముషాలు ఫ్రీ. అంటే యావ‌రేజిన నెల‌కు 1000 మినిషాలు వ‌స్తుంది.

జియో 2,121 ప్లాన్
* ఇది న్యూఇయ‌ర్ ఆఫ‌ర్‌గా వ‌చ్చింది. 2,121 రూపాయ‌ల‌తో రీఛార్జి  చేయించుకుంటే వ్యాలిడిటీ 336 రోజులు.
* రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.
* మొత్తంగా 504 జీబీ 4జీ డేటా ఫ్రీ. అంటే రోజుకు 1.5 జీబీ డేటా ఫ్రీ.
* జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 12వేల నిముషాలు ఫ్రీ. అంటే యావ‌రేజిన నెల‌కు 1000 మినిషాలు వ‌స్తుంది.

జియో 1,299 ప్లాన్
*ఇంట‌ర్నెట్ అవ‌స‌రం పెద్ద‌గా లేనివారికి ఇది బాగా ప‌నికొచ్చే ప్లాన్‌. 1,999 రూపాయ‌ల‌తో రీఛార్జి  చేయించుకుంటే వ్యాలిడిటీ 336 రోజులు.
* రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ.
* మొత్తంగా 24 జీబీ 4జీ డేటా ఫ్రీ.  అంటే యావ‌రేజిన నెల‌కు 2జీబీ వ‌స్తుంది.
* జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 12వేల నిముషాలు ఫ్రీ. అంటే యావ‌రేజిన నెల‌కు 1000 నిమిషాలు వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు