• తాజా వార్తలు

మీ సెల్ నెంబ‌ర్ మార‌కుండానే..  వేరే నెట్‌వ‌ర్క్ నుంచి జియోకు మార‌డం ఎలా?

మొబైల్ నెంబ‌ర్ పోర్ట‌బులిటీ వ‌చ్చాక ఇప్పుడు నెట్‌వ‌ర్క్ మారినా నెంబ‌ర్ మారిపోతుంద‌నే బాధ లేదు. మ‌న పాత నెంబ‌ర్‌నే కంటిన్యూ చేస్తూ కేవ‌లం నెట్‌వ‌ర్క్‌ను మాత్ర‌మే మార్చుకునేందుకు  ట్రాయ్ మొబైల్ నంబ‌ర్ పోర్టబులిటీ తెచ్చింది. మీరు  మీ నంబ‌ర్ అలాగే ఉంచుకుని ఎయిర్‌టెల్ లేదా ఐడియా నెట్‌వ‌ర్క్‌లోకి మారాల‌నుకుంటే ఏం చేయాలో లాస్ట్ ఆర్టిక‌ల్‌లో చూశాం. ఇప్పుడు ఇత‌ర నెట్‌వ‌ర్క‌|్‌ల నుంచి నెంబ‌ర్ మార‌కుండా జియోలోకి ఎలా మారవ‌చ్చో చూద్దాం. 

జియోకు పోర్ట్ అవ‌డం ఎలా?
*ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి మై జియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబ‌ర్ పోర్ట‌బులిటీ సెక్ష‌న్‌కు వెళ్లండి. 
* ఇందులో 2 ఆప్ష‌న్లు ఉంటాయి. మీ ఎగ్జిస్టింగ్ నెంబ‌ర్ అలాగే ఉంచి జ‌స్ట్ నెట్‌వ‌ర్క్ చేంజ్ చేసుకోవ‌డం అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* మీకు ప్రీపెయిడ్ సిమ్ కావాలా పోస్ట్ పెయిడ్ క‌నెక్ష‌న్ కావాలో సెలెక్ట్ చేసుకోండి.
* మీ అవ‌స‌రాల‌కు త‌గిన ప్లాన్‌ను ఎంచుకోండి. 
* త‌ర్వాత మీ లొకేష‌న్ క‌న్ఫ‌ర్మ్ చేయండి. 
* ఇవ‌న్నీ పూర్త‌య్యాక జియో సిమ్ కార్డ్‌ను మీకు డోర్ డెలివ‌రీ చేస్తారు. లేదంటే ద‌గ్గ‌ర‌లో ఉన్న స్టోర్‌కి వెళ్లి తెచ్చుకోవ‌డానికి ఆప్ష‌న్ ఉంది. కావాల్సింది ఎంచుకోవ‌చ్చు. మీరు డోర్ డెలివ‌రీ పెట్టుకుంటే సిమ్ డెలివ‌రీని ట్రాకింగ్ కూడా చేసుకోవ‌చ్చు.   

జన రంజకమైన వార్తలు