• తాజా వార్తలు

వ్యాపార‌స్తుల కోసం జియో ఫైబ‌ర్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌.. మీకు ఏది బెట‌ర్‌?

రిల‌య‌న్స్ జియో.. త‌న జియో ఫైబ‌ర్  బ్రాడ్‌బ్యాండ్‌ను బిజినెస్ ప‌ర్ప‌స్‌లో వాడుకునేవారికోసం కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది.  చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలు నిర్వహించేవారికి 'జియో బిజినెస్' పేరుతో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇందులో త‌క్కు వ ధ‌ర‌కే  డేటా, వాయిస్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది.  నెలకు 901 నుంచి 10,001 వరకు వివిధ ధ‌ర‌ల్లో ఈ ప్లాన్స్ ఉన్నాయి.  ఈ  ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్, స్టాటిక్ ఐపీ, ప్రొడక్టివిటీ, జియో అటెండెన్స్, మార్కెటింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్‌లు లభిస్తాయి. 

జియో బిజినెస్ 901 ప్లాన్ 
* జియోబిజినెస్ రూ.901 ప్లాన్ తీసుకుంటే 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* ఒక లైన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు.  

జియో బిజినెస్ 1201 ప్లాన్ 
* జియోబిజినెస్ రూ.1,201 ప్లాన్ తీసుకుంటే 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* రెండు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. \
* ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ ఇస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. 
*  ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 2 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. 
* మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ ఇస్తుంది.  

జియో బిజినెస్ 2,001 ప్లాన్‌
* జియోబిజినెస్ రూ.2,001 ప్లాన్ తీసుకుంటే 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* నాలుగు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. 
* ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఇది మూడు నెల‌లు ఉంటుంది. 
* ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 4 లైసెన్సులు లభిస్తాయి. 
* జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. 
* మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. 
* రిలయ‌న్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా ఇస్తారు.  
 
జియో బిజినెస్ 3,001 ప్లాన్‌
* జియోబిజినెస్ రూ.3,001 ప్లాన్ తీసుకుంటే 500ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* నాలుగు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. 
* ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఇది మూడు నెల‌లు ఉంటుంది. 
* ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 6 లైసెన్సులు ఇస్తుంది. 
* జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. 
* మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. 
* రిలయ‌న్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా ఇస్తారు.  

జియో బిజినెస్ 5,001 ప్లాన్‌
* జియోబిజినెస్ రూ.5,001 ప్లాన్ తీసుకుంటే 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* నాలుగు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. 
* ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఇది మూడు నెల‌లు ఉంటుంది. 
* ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 6 లైసెన్సులు ఇస్తుంది. 
* జియో అటెండెన్స్ 20 లైసెన్స్‌లు వ‌స్తాయి. 
* మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వెర్షన్ ఇస్తుంది. 
 * కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 2 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 10 లైసెన్సులు లభిస్తాయి.
* రిలయ‌న్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా ఇస్తారు.  

 జియో బిజినెస్ 7,001 ప్లాన్‌
* జియోబిజినెస్ రూ.7,001 ప్లాన్ తీసుకుంటే 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* 8 లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. 
* ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఇది మూడు నెల‌లు ఉంటుంది. 
* ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 15 లైసెన్సులు ఇస్తుంది. 
* జియో అటెండెన్స్ 30 లైసెన్స్‌లు వ‌స్తాయి. 
* మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వెర్షన్ ఇస్తుంది. 
 * కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్  లైసెన్సులు 3, మైక్రోసాఫ్ట్ టీమ్స్  లైసెన్సులు 15 ఇస్తుంది. 
* రిలయ‌న్స్ డిజిటల్ నుంచి డివైస్‌‌లు కూడా ఇస్తారు.  

జియో బిజినెస్ 10,001 ప్లాన్‌
* జియోబిజినెస్ రూ.7,001 ప్లాన్ తీసుకుంటే 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. 
* 8 లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. 
* ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రారంభ ఆఫ‌ర్ కింద ఇది మూడు నెల‌లు ఉంటుంది. 
* ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ లైసెన్సులు 25 ఇస్తుంది. 
* జియో అటెండెన్స్ లైసెన్స్‌లు 50  వ‌స్తాయి. 
* మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వెర్షన్ ఇస్తుంది. 
 * కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్  లైసెన్సులు 4, మైక్రోసాఫ్ట్ టీమ్స్  లైసెన్సులు 25 ఇస్తుంది. 
* రిలయ‌న్స్ డిజిటల్ నుంచి డివైస్‌‌లు కూడా ఇస్తారు.

జన రంజకమైన వార్తలు