• తాజా వార్తలు

జియో నుండి క‌రోనా స్పెష‌ల్ ఓచ‌ర్స్‌తో డ‌బుల్ డేటా ధ‌మాకా.. గ‌మ‌నించారా?

కరోనా భయం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దేశాల‌కు దేశాలు, రాష్ట్రాల‌కు రాష్ట్రాలే లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్నాయి.  స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు.. అన్నీ మూత‌ప‌డ్డాయి. ఫ్యాక్ట‌రీలు, ఆఫీసులు కూడా బంద్ అయ్యాయి. వీలున్నంత‌వ‌రకూ వ‌ర్క్ ఫ్రం హోమ్‌ను ప్రిఫ‌ర్ చేయ‌మ‌ని కంపెనీలన్నీ ఉద్యోగుల‌ను కోరుతున్నాయి.  అందులోనూ ఇంట్లో కూర్చుని ఏం చేయాలో తోచ‌క జ‌నం మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇండియా అంతటా ఇంటర్నెట్ వినియోగం ఎక్కువయ్యింది.
ఈ ప‌రిస్థితుల్లో జియో ఇంటి నుంచి పని చేసేవారికి అదనపు ప్రయోజనాలను కలిగిస్తూ కొత్త 4జీ డేటా వోచర్లను అందుబాటులోకి తెచ్చింది.  

టాక్‌టైమ్ కూడా
4జీ డేటా సౌకర్యంతో పాటు టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ. 101 వరకు ఈ ప్లాన్స్‌లో ఇస్తోంది. హైస్పీడ్ డేటా అయిపోతే 64 కేబీపీఎస్‌తో అన్‌లిమిటెడ్ ఇంట‌ర్నెట్ ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే ఈ స్పీడ్‌తో టెక్స్ట్ మెసేజ్ త‌ప్ప ఇంకేదీ చేయ‌లేం. అయితే ఈ ఓచ‌ర్ల‌న్నీ ఇంత‌కుముందే ఉన్నాయి. కానీ డేటాను డ‌బుల్ చేసింది.

జియో రూ.11 ఓచ‌ర్‌  
ఇంత‌కు ముందు 400 ఎంబీ డేటా వ‌చ్చేది. ఇప్పుడు 800ఎంబీ డేటా, 75 నిమిషాల టాక్‌టైమ్ ఇస్తుంది.
 

జియో రూ.21 ఓచ‌ర్‌  
ఇంత‌కు ముందు 1 జీబీ డేటా వ‌చ్చేది. ఇప్పుడు 2జీబీ డేటా, 200 నిమిషాల టాక్‌టైమ్ ఇస్తుంది.

జియో రూ.51 ఓచ‌ర్‌  
ఇంత‌కు ముందు 3జీబీ డేటా వ‌చ్చేది. ఇప్పుడు 6జీబీ డేటా, 500 నిమిషాల టాక్‌టైమ్ ఇస్తుంది.

జియో రూ.101 ఓచ‌ర్‌  
ఇంత‌కు ముందు 6జీబీ డేటా వ‌చ్చేది. ఇప్పుడు 12జీబీ డేటా, 1000 నిమిషాల టాక్‌టైమ్ ఇస్తుంది.
 

జన రంజకమైన వార్తలు