• తాజా వార్తలు

ఇంట‌ర్ క‌నెక్టెడ్ ఛార్జీలు ఆపేసిన జియో.. ఇక‌పై మంత్లీ ప్లాన్స్‌లో బెనిఫిట్స్ ఏమిటంటే..

ట్రాయ్ రూల్స్ ప్ర‌కారం  జియో ఇటీవల ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు తొలగించింది. అంటే  జనవరి 1 నుంచి జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్ కూడా ఉచిత‌మే. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు  అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుండ‌గా జియో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్ మీద కొంత ప‌రిమితి విధించింది. ఆ ప‌రిమితి దాటితే నిమిషానికి 6 పైస‌లు క‌ట్ అయ్యేవి. ఇప్పుడు కొత్తగా అన్ని నెట్‌వ‌ర్క‌ల‌కు డొమెస్టిక్ వాయిస్ కాల్స్ మీ ప్లాన్ టైమ్‌లో ఉచితంగా చేసుకోవ‌చ్చు.  ఇప్పటికే ఐయూసీ ఛార్జీలు వసూలు చేసిన ప్లాన్స్‌పై ఈ ఛార్జీలకు బదులు అదనంగా కస్టమర్లకు డేటా అందిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో జియోలో ఉన్న ప్లాన్స్‌, వాటిలో వ‌చ్చే బెనిఫిట్స్ ఏమిటో ఓసారి చూద్దాం. 
 
జియో 129 ప్లాన్  
* రూ.129తో రీఛార్జి చేయాలి.  
* వ్యాలిడిటీ 28 రోజులు  
* అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం.  
* 28 రోజుల‌కు క‌లిపి 2జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. 

జియో 199 ప్లాన్ 
* రూ.199తో రీఛార్జి చేయాలి.  
* వ్యాలిడిటీ 28 రోజులు  
* అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం.  
* రోజూ 1.5 జీబీ చొప్పున 28 రోజుల‌కు క‌లిపి మొత్తం 42జీబీ డేటా  లభిస్తుంది. 
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
* జియో యాప్స్‌కు  సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 
 
జియో 249 ప్లాన్ 
* రూ.249తో రీఛార్జి చేయాలి.  
* వ్యాలిడిటీ 28 రోజులు  
* అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం.  
* రోజూ 2 జీబీ చొప్పున 28 రోజుల‌కు క‌లిపి మొత్తం 56 జీబీ డేటా  లభిస్తుంది. 
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
* జియో యాప్స్‌కు  సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

జియో 349 ప్లాన్ 
* రూ.349తో రీఛార్జి చేయాలి.  
* వ్యాలిడిటీ 28 రోజులు  
* అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం.  
* రోజూ 3 జీబీ చొప్పున 28 రోజుల‌కు క‌లిపి మొత్తం  84 జీబీ డేటా  లభిస్తుంది. 
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
* జియో యాప్స్‌కు  సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 

జియో 401 ప్లాన్ 
* రూ.401తో రీఛార్జి చేయాలి.  
* వ్యాలిడిటీ 28 రోజులు  
* అన్ని నెట్‌వ‌ర్క్‌ల‌కు డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం.  
* రోజూ 3 జీబీ చొప్పున 28 రోజుల‌కు క‌లిపి మొత్తం  84 జీబీ డేటా  లభిస్తుంది. 
* రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
* జియో యాప్స్‌కు  సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 
* రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

జన రంజకమైన వార్తలు