అనుకున్నట్లే అయింది.. ఎయిర్‌టెల్ తనతో పోటీకి దిగి సేమ్ ఆఫర్లు ఇవ్వగానే జియో అంతే స్పీడ్‌గా స్పందించింది. తన యూజర్లకు రోజుకు 500ఎంబీ డేటాను అదనంగా అందించబోతుంది. దీని ప్రకారం రోజుకు 1జీబీ డేటా ప్లాన్‌లో ఉన్న యూజర్లకు 1.5 జీబీ, 1.5 జీబీ వస్తున్న యూజర్లకు 2 జీబీ డేటా వస్తుంది. జియో దీన్ని రిపబ్లిక్ డే ఆఫర్‌గా ఈ నెల 26వ తేదీ నుంచి యూజర్లకు ఇవ్వనుంది.
ఎయిర్‌టెల్‌కు పోటీగానే..
జియో 399 రూపాయల ప్లాన్‌లో రోజు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్, రోమింగ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంస్‌ల చొప్పున 84 రోజుల వ్యాలిడిటీతో ఇస్తుంది. ఎయిర్‌టెల్ ఇదే రేటుకు ఇదే ఆఫర్‌ను 70రోజులు మాత్రమే ఇచ్చేది. రీసెంట్‌గా ఎయిర్‌టెల్ కూడా 84 రోజులు ఇచ్చింది. అలాగే కొన్ని ప్లాన్స్‌లో డేటా లిమిట్ పెంచింది. దీంతో జియో మళ్లీ తన ప్లాన్స్‌ను రివైజ్ చేస్తుందని కంప్యూటర్ విజ్ఞానం నిన్నటి ఆర్టికల్ (జియోతో పోటీకి ఎయిర్‌టెల్ సై.. కస్టమర్లకు పండగే)లోనే చెప్పింది. మర్నాడే జియో తన ప్లాన్స్‌ను రివైజ్ చేసింది. డిసెంబర్ నాటికి ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) ఎయిర్‌టెల్‌కు 123 రూపాయలు ఉంటే జియో154 రూపాయలు సంపాదిస్తోంది. కాబట్టి డేటాను మరింత పెంచి యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని జియో ఈ స్టెప్ తీసుకుంది.
1.5 జీబీ ఎవరికి వస్తుందంటే..
* 149 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1జీబీ చొప్పున 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి
* 349 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1జీబీ చొప్పున 70 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి
* 399 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1జీబీ చొప్పున 84 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి
* 499 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1జీబీ చొప్పున 91 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి జనవరి 26నుంచిరోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది.
2జీబీ డేటా ఎవరికి వస్తుంది?
* 198 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ చొప్పున 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి
* 398 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ చొప్పున 70 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి
* 448 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ చొప్పున 84 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి
* 498 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ చొప్పున 91 రోజుల వ్యాలిడిటీ ఉన్నవారికి జనవరి 26నుంచి రోజుకు 2 జీబీ డేటా వస్తుంది.