4జీ వచ్చాక ఇండియాలో మొబైల్ డేటా స్పీడ్ బాగుందని అనుకుంటున్నాం కదా. నిజానికి ఇండియా మొబైల్ డేటా స్పీడ్ ఏమంత గొప్పగా లేదు. వూక్లా అనే సంస్థ అంచనాల ప్రకారం మొబైల్ డేటా స్పీడ్‌లో ఇండియా స్థానం ప్రపంచంలో 131. 138 దేశాల్లో సెప్టెంబర్ నెల డేటా స్పీడ్‌ను అనుసరించి లెక్కగట్టింది. ఆగస్టు కంటే రెండు స్థానాలు వెనుకబడింది.
సింగపూర్, కొరియా టాప్
మొబైల్ అలాగే బ్రాడ్‌బ్యాండ్ డేటా స్పీడ్‌లో సింగపూర్, కొరియా ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందున్నాయి. వూక్లా సంస్థ విడుదల చేసిన 138 దేశాల్లో టెస్ట్ చేసి రిలీజ్ చేసిన స్పీడెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం కొరియాలో మొబైల్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ 121 ఎంబీపీఎస్. ఇది వరల్డ్‌లోనే టాప్. తర్వాత చైనా, యూఏఈ, కతార్, నెథర్లాండ్స్ ఉన్నాయి.ఇక బ్రాడ్‌బ్యాండ్ విషయానికి వస్తే సింగపూర్ 226 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ సెగ్మెంట్లో టాపర్‌గా ఉంది.
ఇండియాలో
ఇండియాలో సెప్టెంబర్ నెలలో మొబైల్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ 12.07 ఎంబీపీఎస్. అదే అప్‌లోడ్ అయితే 4.31 ఎంబీపీఎస్. ఈ వేగంతో మన దేశం స్థానం స్పీడెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో 131. వెనిజువెలా, ఉగాండా, సోమాలియా, బంగ్లాదేశ్, సూడాన్, ఆఫ్గనిస్తాన్ లాంటి వెనుకబడిన దేశాలతో మనం పోటీపడుతున్నామంటే మన మొబైల్ డేటా ఎంత స్పీడ్‌గా ఉందో ఈజీగా అర్ధమవుతుంది.
బ్రాడ్‌బ్యాండ్‌లో కాస్త బెటర్
అయితే బ్రాడ్‌బ్యాండ్‌లో మాత్రం కాస్త బెటర్‌గా ఉన్నాం. 46.47 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్, 42.43 ఎంబీపీఎస్ అప్లోడ్ స్పీడ్‌తో మన ప్లేస్ 138 దేశాల్లో 70. సింగపూర్, హాంకాంగ్, రొమేనియా, స్విట్జర్లాండ్, తాయ్‌లాండ్ టాప్ 5 ప్లేసెస్‌లో ఉన్నాయి.