• తాజా వార్తలు

కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్ రేట్స్‌ను 15-20% పెంచ‌డానికి రెడీ అయింది. డిసెంబ‌ర్‌లో లేదా జ‌న‌వ‌రిలో ఈ పెంపు ప‌క్కా అని మార్కెట్ టాక్‌.

మిగిలిన‌వీ పెంచుతాయా?
ఇప్పుడు ఇండియాలో ప్ర‌భుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మిన‌హాయిస్తే మిగిలిన టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్‌, జియో, వీ మాత్ర‌మే. ఇందులో వీ రేట్ పెంచ‌డానికి సిద్ధ‌మైంది. ఇక ఎయిర్‌టెల్‌, జియో కూడా రెడీ అంటున్నాయ‌ని న్యూస్‌. 


మూడేళ్ల త‌ర్వాత పెంచారు
అంత‌కు ముందు ఎప్ప‌టిక‌ప్పుడు రేట్లు పెంచుకుంటూ పోయే టెలికం కంపెనీలు  2016లో జియో వ‌చ్చాక పోటీని తట్టుకోవ‌డం కోసం మూడేళ్ల‌పాటు రేట్లు పెంచ‌లేదు. మ‌రోప‌క్క క‌నెక్ష‌న్లు పెర‌గ‌డంతో మెయింట‌నెన్స్  ఖ‌ర్చులు పెరిగిపోయాయి. న‌ష్టాలు త‌ట్టుకోలేక‌, ప్ర‌భుత్వానికి వేల కోట్ల రూపాయ‌ల ఏజీఆర్ బ‌కాయిలు క‌ట్ట‌డానికి 2019 డిసెంబ‌ర్‌లో అన్ని కంపెనీలూ ధ‌ర పెంచాయి. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో రౌండ్ మోత మోగ‌బోతోంది.

జన రంజకమైన వార్తలు