• తాజా వార్తలు

అన్ని కంపెనీల ఏడాది రీఛార్జి ప్లాన్స్ వివ‌రాల‌న్నీ ఒకేచోట మీకోసం

త‌మ వినియోగ‌దారులు చేజారిపోకుండా చూసుకోవ‌డం, ప‌క్క నెట్‌వ‌ర్క్ వాడుతున్న యూజ‌ర్ల‌ను త‌మ నెట్‌వ‌ర్క్‌లోకి వ‌చ్చేలా ఆకర్షించ‌డం ఇవీ ప్ర‌స్తుతం  టెలికం కంపెనీల ముందున్న టార్గెట్లు. అందుకోసం రోజుకో కొత్త ప్లాన్‌తో మ‌న ముందుకొస్తున్నాయి. ఒక‌రు ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ ప్ర‌క‌టించ‌గానే అంద‌రూ అదేబాట‌లో ప‌డ్డారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మొద‌లు టెలికం దిగ్గ‌జ సంస్థ ఎయిర్‌టెల్ వ‌ర‌కు అంద‌రిదీ ఇదేబాట‌.  ఈ ప్లాన్స్ అన్ని వివ‌రాల మీ ముందుకు తెస్తున్నాం. ఇందులో బెస్ట్ ఏమిటో మీరే తేల్చుకోండిక‌.

ఎయిర్‌టెల్ 2398 ప్లాన్‌
ఎయిర్‌టెల్ 2,398 రూపాయ‌ల‌కు ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
వ్యాలిడిటీ: 365 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్‌
రోజుకు 1.5 జీబీ డేటా
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
ఫ్రీ హ‌లో ట్యూన్స్‌
జీ5 స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం
వింక్ మ్యూజిక్ ఉచితం
మీ స్మార్ట్‌ఫోన్‌కు ఫ్రీ యాంటీవైర‌స్‌
షా అకాడ‌మీ ఆన్‌లైన్ క్లాస్‌లు ఉచితం
ఫాస్ట్‌టాగ్ తీసుకుంటే 150 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ 


వొడాఫోన్ 2,399 ప్లాన్‌
వొడాఫోన్ 2,399 రూపాయ‌ల‌కు ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
వ్యాలిడిటీ: 365 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్‌
రోజుకు 1.5 జీబీ డేటా
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
ఫ్రీ హ‌లో ట్యూన్స్‌
జీ5 999 రూపాయ‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
499 రూపాయ‌ల విలువైన వొడాఫోన్ ప్లే స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం

జియో 2,399 ప్లాన్‌
జియో త‌న వినియోగ‌దారుల కోసం  2,399 రూపాయ‌ల‌కు ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
వ్యాలిడిటీ: 365 రోజులు
జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్‌,  జియో నుంచి ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 12వేల నిముషాల ఫ్రీకాల్స్ 
రోజుకు 2 జీబీ డేటా
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
ఫ్రీ హ‌లో ట్యూన్స్‌
జియో సినిమా, జియో టీవీ,  జియో మ్యూజిక్ లాంటి  జియో యాప్స్ అన్నీ ఫ్రీగా వాడుకోవ‌చ్చు. 


బీఎస్ఎన్ఎల్ 1,999 ప్లాన్‌
ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్నింటిలో అత్యంత చ‌వ‌కైన‌ది బీఎస్ఎన్ఎల్ 1,999 ప్లాన్‌. 
వ్యాలిడిటీ: 365 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్ (అయితే 250 నిమిషాల లిమిట్ ఉంది)
రోజుకు 3 జీబీ డేటా
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
ఫ్రీ హ‌లో ట్యూన్స్‌
లోక్‌ద‌న్ ఆన్‌లైన్ వీడియో ఏడాది ఫ్రీ
ఈరోస్ నౌ స‌బ్‌స్క్రిప్ష‌న్ 60 రోజులు ఉచితం

ఏది బెస్ట్‌? 
ధ‌ర ప‌రంగా చూస్తే బీఎస్ఎన్ఎల్ బెట‌ర్‌. అయితే ఇది 3జీ నెట్‌వ‌ర్క్ కాబ‌ట్టి నెట్ స్లోగా ఉంటుంది. అదీకాక రోజుకు 250 నిమిషాల కాలింగ్ మాత్ర‌మే అనడం మ‌రో మైన‌స్‌. స‌ర్వీసుల ప‌రంగా చూస్తే ఎయిర్‌టెల్ ఆఫ‌ర్ తిరుగులేనిది. కానీ మీ ఏరియాలో ఏ నెట్‌వ‌ర్క్ బాగుంటుంది, నెట్ స్పీడ్ ఏ ప్రొవైడ‌ర్‌ది బాగుంది అనేది ఆలోచించుకున్నాకే వీటిలో ఏ ప్లాన్ మీకు స‌రిపోతుందో తెలుస్తుంది.

జన రంజకమైన వార్తలు